వేడుకల్లో మేకప్ ఇలా..
వేడుకల్లో తాజాగా కనిపించాలని రకరకాల మేకప్‌లు, క్రీములు రాసుకుంటాం. అసలే వేడి, చెమట. అవన్నీ సరైన పద్ధతిలో వాడుతున్నారా చూసుకోమంటున్నారు నిపుణులు.
వేడుకల్లో తాజాగా కనిపించాలని రకరకాల మేకప్‌లు, క్రీములు రాసుకుంటాం. అసలే వేడి, చెమట. అవన్నీ సరైన పద్ధతిలో వాడుతున్నారా చూసుకోమంటున్నారు నిపుణులు..
అందంగా తీర్చిదిద్దేందుకు చాలా రకాల ఉత్పత్తులే ఉన్నాయి. వాటిలో సరైనవి ఎంచుకుంటే ఎన్ని గంటలైనా తాజాగా మెరిసిపోవచ్చు.
* క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేశాక ఐస్‌క్యూబ్‌తో రుద్దాలి. జిడ్డు చర్మం ఉన్న వారు గంటముందు సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవాలి. సన్‌స్క్రీన్ లోషన్‌ని బయటకు వెళ్లినప్పుడు కూడా తీసుకెళ్లడం చాలా మంచిది. తర్వాత అలోవెరా జెల్‌ని రాయాలి. దీని వల్ల చర్మంపై మేకప్ ఎంత సేపు ఉన్నా హాని కలగదు.
* బీబీ క్రీమ్ ఎంచుకుంటే మంచిది. పగలు ఫౌండేషన్ వాడటం వల్ల చర్మంపై ప్యాచ్‌లుగా మరకలు కనిపిస్తాయి. ఒక వేళ ఫౌండేషన్ తప్పక వాడాల్సొస్తే ఎస్‌పీఎఫ్ లేనిదైతే మంచిది.
* కళ్లకు వాటర్‌ప్రూఫ్ ఐలైనర్, కాటుక ఎంచుకుంటే మేలు. చెమట పట్టినప్పుడు కళ్లనుంచి అది ముఖమంతా వ్యాపించకుండా ఉంటుంది. ఎక్కువ సమయం తీసుకున్నా నిదానంగా రాసుకోండి. ఎందుకంటే వాటర్ ప్రూఫ్ ఉత్పత్తులు ముఖంపై ఎక్కడైనా అంటుకుంటే మేకప్ పాడవుతుంది.
* పౌడర్ వాడాలనుకున్నప్పుడు కాంపాక్ట్ కంటే పౌడర్ ఎంపికే మంచిది. కాంపాక్ట్ పౌడర్ ముఖాన్ని కొద్ది సేపటికే జిడ్డుగా కనిపించేలా చేస్తుంది. లూజు పౌడర్‌తో ఆ సమస్య ఉండదు.
* వేసవిలోను, వాతావరణం వేడిగా ఉన్నప్పుడూ లిప్‌స్టిక్‌ని వాడక పోవడమే నయం. తప్పనిసరైతే తేలిక రంగులు ఎంచుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.