గోళ్లనిలా కాపాడుకోండి!

అమ్మాయిలు తమ చేతులూ, గోళ్లూ... కోమలంగా కనిపించాలని భావించినా, వాటిపై ఎలా శ్రద్ధపెట్టాలో తెలియక సతమతమవుతుంటారు.

Updated : 29 Jun 2023 00:33 IST

అమ్మాయిలు తమ చేతులూ, గోళ్లూ... కోమలంగా కనిపించాలని భావించినా, వాటిపై ఎలా శ్రద్ధపెట్టాలో తెలియక సతమతమవుతుంటారు.

  • నీళ్లల్లో ఎక్కువ సేపు నానినా, కఠిన రసాయనాలు, అధికవేడి వంటిచోట్ల పనిచేసినా త్వరగా విరిగిపోతుంటాయి. అందుకే ఈ పరిస్థితుల్లో కచ్చితంగా గ్లవుజులు వాడండి. గోళ్లు కొరికే అలవాటు ఉంటే మానుకోండి.
  • గోరువెచ్చని నీళ్లల్లో కాస్త బేకింగ్‌ సోడా వేసి  వేళ్లు తడిచేలా మునగనిస్తే... మట్టితో పాటూ సూక్ష్మక్రిములూ పోతాయి.
  • బేస్‌ కోట్‌ వేసి నెయిల్‌పాలిష్‌ వేసుకోవడం వల్ల రసాయనాల ప్రభావంతో మరకలు పడకుండా ఉంటాయి. రంగూ ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. మెరుపునీ ఇస్తుంది.
  • చాలామంది నెయిల్‌పాలిష్‌ని పెచ్చులు పెచ్చులు కింద పీకుతుంటారు. దీనివల్ల గోళ్ల పైపొర దెబ్బతిని పాడవుతుంటాయి. రంగు పూర్తిగా తీశాకే... మరో కోట్‌ వేయాలి తప్ప... దానిమీదే మళ్లీ వేయొద్దు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్