తెల్లగా లేననేవారు

సినిమా నేపథ్యమున్న అమ్మాయిని కాదు. ప్రారంభంలో కష్టాలు మామూలేగా! పైగా మోడలింగ్‌ నుంచి ఇటువైపు వచ్చా. మిస్‌ ఇండియాగా నిలిచినా ‘మోడలింగ్‌ అంటే అందాల బొమ్మలే.. నటనకు పనికి రార’న్న భావనే చాలామందిలో. యాడ్‌ షూటింగ్‌ ఆడిషన్‌లకి వెళితే ‘తెల్లగా లేవు’ అనేవారు.

Published : 02 Jul 2023 00:24 IST

- శోభితా ధూళిపాళ్ల, నటి

సినిమా నేపథ్యమున్న అమ్మాయిని కాదు. ప్రారంభంలో కష్టాలు మామూలేగా! పైగా మోడలింగ్‌ నుంచి ఇటువైపు వచ్చా. మిస్‌ ఇండియాగా నిలిచినా ‘మోడలింగ్‌ అంటే అందాల బొమ్మలే.. నటనకు పనికి రార’న్న భావనే చాలామందిలో. యాడ్‌ షూటింగ్‌ ఆడిషన్‌లకి వెళితే ‘తెల్లగా లేవు’ అనేవారు. ఇక సినిమా వాటికి వెళ్లినప్పుడు.. మొహమ్మీదే ‘అంత అందంగా లేవ’ని చెప్పేవారు. మొదట్లో బాధ ఉండేది. అలాగని కుంగిపోలేదు, వదిలేయాలనీ అనుకోలేదు. నా సృజనాత్మకతను చూపిస్తూనే పరిశ్రమలో కొనసాగే మార్గాలేమున్నాయా అని వెతికా. నేనో డ్యాన్సర్‌ని కూడా. అయినా పెద్ద సినిమా అవకాశాలే కావాలని కూర్చోలేదు. ఏ అవకాశమొచ్చినా వాటిలో ఉత్తమమైన వాటిని ఎంచుకొని చేసుకుంటూ వెళ్లిపోయా. నటిగా ఎదగొచ్చని అన్ని భాషల్లోనూ ప్రయత్నించా. ఇప్పుడు నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. నిర్మాతలకు నాపై నమ్మకం ఏర్పడింది. ఒక పెద్ద ఫిల్మ్‌మేకర్‌ వచ్చి అవకాశమిస్తారని ఎదురు చూడకుండా నాకున్న మార్గాలను వెతుక్కుంటూ వెళ్లడం వల్లే సాధ్యమైంది. ఎవరైనా అంతే! అవకాశాలు రాలేదని బాధపడటం కాదు.. వీలైన మార్గాలను వెతుక్కోవాలి. అప్పుడే కదా పరిధులు దాటి దూసుకెళ్లడం సాధ్యమయ్యేది? తిరస్కరణలు పట్టించుకోకుండా ఆడిషన్లకు హాజరవ్వడం.. నా వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చా. నిజానికి నేనేమీ నేర్చుకుని రాలేదు. పనిచేస్తూ నేర్చుకున్నా. స్టార్డమ్‌ సాధించాలన్న కోరికా లేదు. ఒక మంచి నటిననే గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నా. అందుకే నాకు సవాలు విసిరే పాత్రలనే ఎంచు కుంటున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్