పండ్లతో ప్యాక్‌లు..

పోషకాహార లోపం, విటమిన్లు, కాలుష్యం కారణంగా జుట్టు రాలే సమస్య పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు వివిధ రకాల కేశ ఉత్పత్తులు వాడుతుంటాం.

Published : 14 Sep 2023 02:03 IST

పోషకాహార లోపం, విటమిన్లు, కాలుష్యం కారణంగా జుట్టు రాలే సమస్య పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు వివిధ రకాల కేశ ఉత్పత్తులు వాడుతుంటాం. బదులుగా సహజంగా దొరికే పండ్లని ఉపయోగించి వేసే హెయిర్‌ మాస్క్‌లను ప్రయత్నించి చూడండి..

  • పుచ్చకాయ- బొప్పాయి.. పండిన బొప్పాయి, పుచ్చకాయని మిక్సీపట్టి పేస్టుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఆరాక తలస్నానం చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. వీటిలోని  యాంటీఆక్సిడెంట్లు కురులకి తేమనందించి రాలే సమస్యని నివారిస్తాయి.
  • అరటి- కొబ్బరిపాలు.. ఇవి కేశాలను ఒత్తుగా, దృఢంగా పెరిగేలా చేస్తాయి. మగ్గిన అరటిపండుకి కొన్ని కొబ్బరిపాలు చేర్చి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంటాగి గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చాలు.
  • యాపిల్‌- తేనె..  యాపిల్‌లోని పోషకాలు జుట్టు సంరక్షణకు ఉపయోగపడతాయి. అరకప్పు యాపిల్‌ పేస్టుకి కొద్దిగా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించాలి. పావుగంటాగి గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే కురులు నిగనిగలాడతాయి.
  • క్యారెట్‌- అరటి.. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్స్‌, విటమిన్లు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఓ పాత్రలో నీటిని మరిగించి దానిలో క్యారెట్‌, అరటి ముక్కలను వేసి పేస్టు చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టంతా పట్టించాలి. తర్వాత గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్