పాత పట్టు కొత్తగా...

అమ్మమ్మ జ్ఞాపకంగా దాచుకున్నవీ, అమ్మ ప్రేమతో కొనిచ్చినవీ,  మనమెంతో ఇష్టపడి కొనుకున్నవీ... పట్టు చీరలు మన దగ్గర చాలానే ఉంటాయి.  కానీ, వీటిని ఏడాదికి ఒక్కసారైనా కట్టుకోలేని పరిస్థితి చాలామందిది. మీరూ అంతేనా! అయితే, వాటిని అవసరం, ట్రెండ్‌లకు అనుగుణంగా మార్చేసుకుంటే సరి.

Published : 18 Sep 2023 02:07 IST

అమ్మమ్మ జ్ఞాపకంగా దాచుకున్నవీ, అమ్మ ప్రేమతో కొనిచ్చినవీ,  మనమెంతో ఇష్టపడి కొనుకున్నవీ... పట్టు చీరలు మన దగ్గర చాలానే ఉంటాయి.  కానీ, వీటిని ఏడాదికి ఒక్కసారైనా కట్టుకోలేని పరిస్థితి చాలామందిది. మీరూ అంతేనా! అయితే, వాటిని అవసరం, ట్రెండ్‌లకు అనుగుణంగా మార్చేసుకుంటే సరి. మూలన పెట్టేశామన్న బాధ లేకుండా సంతృప్తితో పాటు నయా స్టైలూ మీ సొంతమవుతుంది.

కాంట్రాస్ట్‌గా.. పాత పట్టుచీరల అంచులు చిరిగితే, వాటిని తొలగించి మిగతా చీరతో కుర్తా లేదా సల్వార్‌ కుట్టించుకోవచ్చు. హెమ్‌లైన్‌, నెక్‌లైన్‌, స్లీవ్స్‌కు కాంట్రాస్ట్‌ ప్యాచ్‌వర్క్‌ను జత కలిపితే చాలు. చక్కటి డ్రెస్‌ సిద్ధం. టాప్‌నకు ఒక చీరను, బాటమ్‌, దుపట్టాలకు మ్యాచింగ్‌ లేదా కాంట్రాస్ట్‌గా మరో చీరను తీసుకుంటే అవుట్‌ఫిట్‌ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. అలాగే పట్టుచీరతో కుట్టిన కుర్తాకు పలాజో, లెగ్గింగ్‌ లేదా ధోతీ ప్యాంటు చక్కటి ఎంపిక.

లెహెంగాకు .. పెద్ద బోర్డరుండే పట్టుచీరను లెహెంగా, పరికిణీ ఓణీలకు ఎంచుకోవచ్చు.  బ్లవుజు మాత్రం దానికి భిన్నంగా కాంతిమంతమైన రంగులో ఉంటే మేలు.  బోర్డరు పాడైన పాత చీరతో చేసే లెహెంగాకు సీక్విన్‌, జర్దోసి, ఎంబ్రాయిడరీ లేదా లేసుల్ని వాడి నయా లుక్‌ తీసుకురావొచ్చు. పెద్ద అంచుతో ఉన్నవాటిని కఫ్తాన్‌లుగా కుట్టించుకోవచ్చు. సన్నంచులవి కుర్తాలకు బాగుంటాయి.

ఒన్‌ పీస్‌ గౌన్‌గా.. చిన్న బోర్డరు, ముదురు, లేత వర్ణాల కలయికతో ఉన్న చీరను లాంగ్‌ గౌన్‌లా మార్చుకోవచ్చు. ఇది కొత్త ట్రెండ్‌ కూడా. చేతులు, యోక్‌ భాగంలో ఎంబ్రాయిడరీ, అటాచ్డ్‌ దుపట్టా, నడుముకి బెల్ట్‌ అంటూ.. రకరకాల థీం వర్క్‌తో దాన్ని మరింత అందంగా మార్చేయొచ్చు. అలాగే చీరంతా పాతదై కొంగు మాత్రం ప్రత్యేకంగా అనిపిస్తే ఓవర్‌ కోట్‌, హాఫ్‌, లాంగ్‌ జాకెట్‌, షర్ట్‌లుగా డిజైన్‌ చేసుకోవచ్చు. జీన్స్‌, లెగ్గింగ్స్‌, షార్ట్స్‌లపైకి  ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్