నిమిషాల్లో అందంగా!

పండగ వేళ.. ఉదయాన్నే లేచి పని చక్కబెట్టుకునే సరికి నీరసం ఆవరిస్తుంది. ఇక ఎంత చక్కటి వస్త్రాలు, నగలు ధరించినా కళ ఎక్కడి నుంచి వస్తుంది? అందం కోసమని ఎక్కువ సమయం కేటాయించలేము కూడా.

Published : 18 Sep 2023 02:07 IST

పండగ వేళ.. ఉదయాన్నే లేచి పని చక్కబెట్టుకునే సరికి నీరసం ఆవరిస్తుంది. ఇక ఎంత చక్కటి వస్త్రాలు, నగలు ధరించినా కళ ఎక్కడి నుంచి వస్తుంది? అందం కోసమని ఎక్కువ సమయం కేటాయించలేము కూడా. మరెలాగంటారా? నిమిషాల్లో సమస్యను తీర్చే ఈ చిట్కాలు ప్రయత్నించండి.

  • ఒక వస్త్రంలో ఐస్‌ క్యూబును ఉంచి, రెండు నిమిషాలు ముఖమంతా రుద్దండి. చర్మాన్ని బిగుతుగా చేయడమే కాదు.. ముఖం, కళ్లు ఉబ్బడం లాంటి వాటినీ దూరం చేస్తుంది. పూర్తవగానే కాస్త మాయిశ్చరైజర్‌ రాస్తే చాలు. ముఖం సహజంగా మెరవడం మీరే గమనిస్తారు.
  • చర్మం నిర్జీవంగా కనిపిస్తోంటే.. పాల మీగడను ప్రయత్నించండి. శుభ్రం చేసిన ముఖానికి మీగడను రాసి, మర్దనా చేయాలి. అయిదు నిమిషాలయ్యాక చల్లని నీటితో కడిగితే సరి. చర్మం మృదువుగా మారడమే కాదు.. మెరుస్తుంది కూడా.
  • దుస్తులు, పూజా సామగ్రి అంటూ ఎంత తిరుగుతాం? ఎండ వేడే కాదు.. దుమ్ము కూడా చర్మానికి చేటు చేస్తుంది. రెండు చెంచాల టొమాటో రసానికి అరచెంచా తేనె కలిపి, ముఖానికి పట్టించి, అయిదు నిమిషాలయ్యాక కడిగేయండి. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మరంధ్రాల్లోకి చేరిన దుమ్మును తొలగించి మేనికి సహజ మెరుపును అందిస్తాయి.
  • చర్మానికి గులాబీ నీరు చేసే మేలెంతో! ఈసారి కాస్త చల్లగా ప్రయత్నించండి. శుభ్రమైన ముఖంపై రోజ్‌ వాటర్‌లో దూదిని ముంచి తుడవాలి. ఆపై మాయిశ్చరైజర్‌ రాయాలి. ఇలా చేస్తే చర్మంపై మురికి తొలగడమే కాదు చర్మం కూడా తాజాగా కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్