ట్రెండ్‌.. సెట్‌ చేద్దాం!

అందంగా కనిపించాలనీ, కొత్త ట్రెండ్‌లు అనుసరించాలనీ అందరూ అనుకుంటాం. కానీ, ఎప్పటికీ మారని కొన్ని ఫ్యాషన్‌ సూత్రాలను అనుసరిస్తే చాలు... అన్ని వేళలా స్టైలిష్‌ లుక్‌లో మెరిసిపోవచ్చు. ఎప్పటికప్పుడు మారిపోయేదే ఫ్యాషన్‌. అందుకే, ఎప్పుడూ ఒకే రకం ఎంచుకోవద్దు.

Published : 20 Nov 2023 01:44 IST

అందంగా కనిపించాలనీ, కొత్త ట్రెండ్‌లు అనుసరించాలనీ అందరూ అనుకుంటాం. కానీ, ఎప్పటికీ మారని కొన్ని ఫ్యాషన్‌ సూత్రాలను అనుసరిస్తే చాలు... అన్ని వేళలా స్టైలిష్‌ లుక్‌లో మెరిసిపోవచ్చు.

మ్యాచ్‌ చేసేయండి...

ఎప్పటికప్పుడు మారిపోయేదే ఫ్యాషన్‌. అందుకే, ఎప్పుడూ ఒకే రకం ఎంచుకోవద్దు. కొత్తదనం కోసం మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ చేసేయండి. ఉదాహరణకి స్కిన్నీ ప్యాంటుకి జతగా లూజ్‌ షర్ట్‌ వేసి చూడండి. క్రాప్‌టాప్‌ శారీమీదకూ నప్పుతుంది. ప్రింటెడ్‌ స్కర్ట్‌కి జతగా ప్లెయిన్‌ టాప్‌ ఇలా ప్రయోగాలూ చేయండి.

నలుపే మెరుపు...

మీ వార్డ్‌రోబ్‌లో కచ్చితంగా ఓ నలుపు గౌనో, స్కర్టో, టాపో ఉంచుకోండి. పార్టీ ఏదైనా దుస్తుల ఎంపిక తేలనప్పుడు.. దీనికే ప్రాధాన్యం ఇవ్వండి. జతగా సిల్వర్‌ జ్యూయలరీని వేసుకోండి. నడుముకో మెటాలిక్‌ బెల్ట్‌, క్లాసిక్‌ హీల్స్‌... మీ లుక్‌నే మార్చేస్తాయి.  

క్లాసిక్‌ లుక్‌ కోసం...

పట్టు, జరీ, సిల్కు చీరలెన్ని ఉన్నా ఆయా సందర్భానికి మాత్రమే బాగుంటాయి. ఫాలింగ్‌ రాసిల్క్‌, బాందినీ, బనారసీ, హ్యాండ్‌లూమ్‌ రకాలు చిన్న చిన్న గెట్‌టూగెదర్‌లకు, ఆఫీసుకు బాగుంటాయి. డ్రెస్‌ల విషయానికి వస్తే... చినోన్‌ సిల్క్‌ ప్లోరల్‌ అనార్కలీ, ఏ లైన్‌తో పాటు ఒక రాసిల్క్‌ కుర్తా సెట్‌నీ మీ బీరువాలో పెట్టుకుంటే సందర్భానికి తగ్గట్లు వేసుకోవచ్చు. ఒక్కోసారి డ్రెస్‌ ఎంత సాదాగా ఉన్నా... దుపట్టా దాని లుక్‌నే మార్చేస్తుంది. అందుకే, సిల్వర్‌, గోల్డ్‌ ప్యాటర్న్‌ తో పాటు మల్టీకలర్డ్‌ కలంకారీ, ఫ్లోరల్‌ జరీ దుపట్టాలు వేటి మీదకైనా నప్పుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్