సొగసు ఉసిరి..

మామూలు రోజులతో పోలిస్తే ఈ చలికాలంలో మనకి రోగనిరోధకశక్తి చాలా అవసరం. ఇందుకోసం ఎన్నో ఆహారాలున్నా... ఉసిరి ప్రత్యేకం. ఎందుకంటే విటమిన్‌ సితోపాటు ఔషధ గుణాలు మెండుగా ఉండే ఫలమిది.. 

Published : 22 Nov 2023 01:42 IST

మామూలు రోజులతో పోలిస్తే ఈ చలికాలంలో మనకి రోగనిరోధకశక్తి చాలా అవసరం. ఇందుకోసం ఎన్నో ఆహారాలున్నా... ఉసిరి ప్రత్యేకం. ఎందుకంటే విటమిన్‌ సితోపాటు ఔషధ గుణాలు మెండుగా ఉండే ఫలమిది.. 

చలికి చర్మం, జుట్టు మృదుత్వాన్ని కోల్పోయి బిరుసుగా మారతాయి. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మంలో కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతిమంతంగా కనిపించేట్టు చేస్తాయి. ఉసిరి ఈ  కాలంలో వేధించే చుండ్రుని నివారించి కురులు చక్కగా పెరగడానికి కారణం అవుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఉసిరిని సలాడ్‌, జ్యూస్‌, మురబ్బాల రూపంలోనూ తీసుకోవచ్చు.

ఈ కాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉసిరిలో ఉండే పీచు.. పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. దాంతో మలబద్ధకం దూరమవుతుంది. జీర్ణవ్యవస్థ నుంచి వ్యర్థాలు తేలిగ్గా దూరమవుతాయి. ఈ కాలంలో వచ్చే సాధారణ దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సీజనల్‌ వ్యాధులను నివారించడంలో ఉసిరి ముందుంటుంది.

ఉసిరికి ఒత్తిడిని తగ్గించే గుణముంది. దీనిలోని ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌తో పోరాడి ఒత్తిడి తగ్గిస్తాయి. జబ్బులపై పోరాడే తెల్లరక్తకణాలని వృద్ధి చెందేట్టు చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్