పగిలే పెదాలకు ఇంటి చిట్కాలు...

ఈ కాలంలో పెదాలు పొడిబారి, పగిలిపోతుంటాయి. దీని వల్ల అధరాలు అందం కోల్పోతాయి. ఇంటి చిట్కాలతోనే ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు.

Updated : 25 Nov 2023 02:49 IST

ఈ కాలంలో పెదాలు పొడిబారి, పగిలిపోతుంటాయి. దీని వల్ల అధరాలు అందం కోల్పోతాయి. ఇంటి చిట్కాలతోనే ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు..

  • పగిలిన పెదాలను అస్తమానం తడపడం వల్ల అవి మరికాస్త పొడిబారతాయి. అలా కాకుండా కలబంద గుజ్జును పెదాలకు రాసి చూడండి. దీనిలోని పాలీశాకరైడ్లకు.. గాయాన్ని త్వరగా నయం చేసే గుణం ఉంది. ఈ గుజ్జును పెదాలకు రాసుకుని అరగంట ఉంచాలి. ఆపై నీటితో శుభ్రం చేసుకుంటే పగుళ్లు దూరమవుతాయి.
  • పొడిబారిన పెదాలకు తేనె మంచి మందు. రెండు చుక్కల తేనె తీసుకొని పెదాలపై మృదువుగా మర్దనా చేయాలి. ఇందులోని యాంటీమైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పగుళ్లు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తాయి.
  • పెదాలు పగిలి మంటపుడుతుంటే... నెయ్యి రాసి చూడండి. ఉపశమనం కలుగుతుంది. ఇది పెదాలను మృదువుగానూ ఉంచుతుంది.
  • కొబ్బరి నూనె.. దీన్ని రోజూ పెదాలకు రాస్తూ ఉంటే మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు ఉంటాయి. ఇది ఇన్‌ఫెక్షన్‌లను నివారించి,  పగుళ్ల నుంచి రక్షిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్