చలికాలం చిక్కులా!

కాలాన్ని బట్టి చర్మం తీరూ మారుతుంది. ఈ కాలంలో పొడారడం, పగుళ్లు రావడం వంటి ఇబ్బందులెన్నో! వీటి నుంచి ఈ చిట్కాలతో ఉపశమనం పొందొచ్చు. అదెలాగంటే...

Updated : 28 Nov 2023 04:43 IST

కాలాన్ని బట్టి చర్మం తీరూ మారుతుంది. ఈ కాలంలో పొడారడం, పగుళ్లు రావడం వంటి ఇబ్బందులెన్నో! వీటి నుంచి ఈ చిట్కాలతో ఉపశమనం పొందొచ్చు. అదెలాగంటే...

ఈ కాలంలో మాయిశ్చరైజర్‌ ఆధారిత ఉత్పత్తులనే వాడాలి. ముఖ్యంగా అవి చర్మంలోకి త్వరగా ఇంకి, పోషకాలందించేవై ఉండాలి. స్నానం చేశాక తేమ ఉన్నప్పుడే ఈ క్రీము రాసుకోవాలి. ముఖం కడిగిన ప్రతిసారీ, ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందూ తప్పనిసరిగా రాయడం అలవరుచుకుంటేనే తాజాగా, తేమగా కనిపించొచ్చు.

బ్యాక్టీరియాకు దూరం..

రోజులో ఒక్కసారి మాత్రమే సన్‌స్క్రీన్‌ రాస్తే సరిపోతుందనుకోవద్దు. కనీసం రెండు మూడు సార్లైనా దీన్ని రాసుకోవాలి. హైపర్‌ పిగ్మెంటేషన్‌ సమస్య ఉన్నవారు అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఈ సీజన్‌లో హైలురోనిక్‌ యాసిడ్‌ ఉన్న మాయిశ్చరైజర్‌ను వినియోగిస్తే చర్మం పగుళ్లు రాకుండా మృదువుగా ఉంటుంది. ఉదయం ఈ యాసిడ్‌ బేస్డ్‌ క్రీంను తేలికైనదాన్ని ఎంచుకొని, రాత్రి నిద్రకు ముందు చిక్కని (హెవియర్‌) మాయిశ్చరైజర్‌ను వినియోగిస్తే మంచిది. అలాగే క్రీం లేదా మాయిశ్చరైజర్లను గాజుసీసాల నుంచి వేళ్లతో తీయకుండా చెక్క చెంచా వినియోగించాలి. లేదా చేతులను శుభ్రపరుచుకొని క్రీం తీసుకోవాలి. లేదంటే వేళ్లకున్న బ్యాక్టీరియా... క్రీం లోపలికి చేరే ప్రమాదం ఉంది. తర్వాత దీన్ని వాడినప్పుడు అది చర్మంపైకి చేరి అనారోగ్యాలకు కారణం కావొచ్చు.

డీహైడ్రేషన్‌ రానివ్వొద్దు..

శీతాకాలంలో చాలామంది చలిగా ఉందనో, దాహం వేయడం లేదనో నీళ్లను తాగరు. మీరూ ఇలా చేస్తున్నారా? వద్దు. ఇది డీహైడ్రేషన్‌కు దారితీసి చర్మం పెళుసుబారేలా చేస్తుంది. పగుళ్లూ వస్తాయి. దీంతోపాటు రోజూ నిద్రపోయే ముందు మేకప్‌ తొలగించి ముఖం శుభ్రపరచాలి. లేదంటే చర్మకణాల పని తీరు మందగిస్తుంది. అందులోని రసాయనాలు ముఖంపై ముడతల్లోకి ఇంకి చర్మ సంబంధిత సమస్యలను తెస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్