జుట్టు పొడిబారుతోందా?

మారిన వాతావరణ ప్రభావం శరీరంతో పాటు శిరోజాల మీదా పడుతుంది. దాంతో జుట్టు నిర్జీవంగా మారటం, చివర్లు చిట్లిపోవడం జరుగుతుంది. అందుకే కాలానికి తగిన విధంగా మన కురులను సంరక్షించుకోవాలి మరి.

Published : 29 Nov 2023 01:34 IST

మారిన వాతావరణ ప్రభావం శరీరంతో పాటు శిరోజాల మీదా పడుతుంది. దాంతో జుట్టు నిర్జీవంగా మారటం, చివర్లు చిట్లిపోవడం జరుగుతుంది. అందుకే కాలానికి తగిన విధంగా మన కురులను సంరక్షించుకోవాలి మరి. అందుకోసం ఏవేవో కొనేసి కష్టపడాల్సిన పని లేదు. మన వంటింట్లో దొరికే వాటితోనే సంరక్షించుకోవచ్చు.

  • జుట్టు పొడిగా మారి, చివర్లు చిట్లుతున్నట్టుగా కనిపిస్తే బాగా పండిన అరపండుని గుజ్జుగా చేసి, దానిలో నాలుగు చెంచాల కొబ్బరినూనె, చెంచా చొప్పున తేనె, గ్లిజరిన్‌ వేసి బాగా కలపాలి. ఈ పేస్టును కురులకు పూతలా వేసి అరగంటాగి గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇందులోని తేనె, గ్లిజరిన్‌లు జుట్టుకి తేమనందించి చివర్లు చిట్లకుండా కాపాడతాయి.
  • అయిదు చెంచాల శనగపిండికి రెండు చెంచాల చొప్పున ఆలివ్‌నూనె, పెరుగు కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని మొదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి ఇరవై నిమిషాలాగి గోరువెచ్చని నీటితో తలంటుకోవాలి. ఇది జట్టుకి మంచి కండిషనర్‌గా పనిచేయటమే కాదు కుదుళ్లను దృఢంగానూ ఉంచుతుంది. ఆలివ్‌ నూనె జుట్టుకి తేమనందించి మెరిసేలా చేస్తుంది.
  • గుడ్డులోని తెల్ల సొనకు రెండు చెంచాల చొప్పున శనగపిండి, బాదం పొడి, తగినంత గులాబీనీరు కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి అరగంట ఆగి, గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరి. కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి.
  • జుట్టు పొడిబారకుండా... రెండు చెంచాల మెంతిపిండికి నాలుగు చెంచాల కొబ్బరిపాలను కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీన్ని మాడుకి పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. గంట తర్వాత  గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేస్తే సరి. తగ్గుముఖం పడుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్