అందానికి కలువలు!

శీతగాలులు చర్మాన్ని పొడారిపోయేలా చేస్తాయి. క్రీములెన్ని రాసినా రోజు పూర్తయ్యేసరికి చర్మం నిర్జీవంగానే ఉంటుంది. చలికాలమంతా ముఖారవిందాన్ని కలువ పూలతో మెరుపులీనేలా, మృదువుగా మార్చేయొచ్చు. అదెలాగో చూద్దాం.

Published : 01 Dec 2023 01:23 IST

శీతగాలులు చర్మాన్ని పొడారిపోయేలా చేస్తాయి. క్రీములెన్ని రాసినా రోజు పూర్తయ్యేసరికి చర్మం నిర్జీవంగానే ఉంటుంది. చలికాలమంతా ముఖారవిందాన్ని కలువ పూలతో మెరుపులీనేలా, మృదువుగా మార్చేయొచ్చు. అదెలాగో చూద్దాం.

తేనె-పసుపుతో... పోషక విలువలు పుష్కలంగా ఉండే కలువ పూల రేకలను పది తీసుకుని మెత్తగా నూరుకోవాలి. దీనికి చెంచా తేనె కలిపి ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత కడిగితే చాలు. చర్మం మృదువుగా మారుతుంది. పూలు దొరకనప్పుడు మార్కెట్‌లో దొరికే పొడినీ వాడుకోవచ్చు. రెండు చెంచాల ఈ పొడికి పావుచెంచా పసుపు, పాలు కలిపి ముఖానికి రాయాలి. దీన్ని పావుగంటయ్యాక కడిగేస్తే సరి. చర్మఛాయ మెరుగుపడుతుంది. ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.

కలబంద-పెరుగుతో.. ఐదారు కలువ పూలను మెత్తగా నూరుకోవాలి. దానికి చెంచా కలబంద గుజ్జు, కాస్త పెరుగు కలిపి ముఖానికి రాసి ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. చలిగాలికి చర్మం పొడారకుండా కాపాడుతుందీ ప్యాక్‌. కొత్త మెరుపునీ అందిస్తుంది. చర్మానికి తేమను అందించి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

గంధంతో.. చెంచా కలువ పూల ముద్దకు, చెంచా గంధంపొడిని కలిపి ముఖానికి ప్యాక్‌ వేయాలి. ఆరాక కడిగేస్తే చాలు.. చర్మం కొత్త నిగారింపుతో మెరిసిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్