అందాన్ని పెంచే ఆముదం!

ఆముదం అంటే ముఖం అదోలా పెట్టేవారు చాలామందే. కానీ, ఈ కాలంలో దీన్ని వాడటం వల్ల  ప్రయోజనాలెన్నో అంటారు సౌందర్య నిపుణులు. మరి అవేంటో చూద్దామా!

Published : 02 Dec 2023 01:41 IST

ఆముదం అంటే ముఖం అదోలా పెట్టేవారు చాలామందే. కానీ, ఈ కాలంలో దీన్ని వాడటం వల్ల  ప్రయోజనాలెన్నో అంటారు సౌందర్య నిపుణులు. మరి అవేంటో చూద్దామా!

  • ముఖంపై ముడతలు వచ్చి, చర్మం నిర్జీవంగా మారితే..ఆముదంలో కాస్త తేనె కలిపి చర్మానికి పూతలా వేయండి. అరగంటయ్యాక కడిగేస్తే సరి. ఇలా రోజూ చేస్తుంటే..చర్మం నిగనిగలాడుతూ, యౌవ్వనంగా కనిపిస్తారు.
  • చలికాలం వచ్చిందంటే చాలు చర్మం, జుట్టు పొడిబారతాయి. పెదాలు పగులుతుంటాయి. ఇలాంటప్పుడు గోరువెచ్చని ఆముదంలో కొంచెం కొబ్బరినూనె కలిపి ఒంటికి రాసి మర్దన చేయండి. అరగంటాగి పెసరపిండితో నలుగుపెట్టి స్నానం చేస్తే సరి. చర్మం నిగనిగలాడుతుంది. పెదాలకు రోజూ రాత్రిపూట రాస్తే సరి. ఉదయానికల్లా తేమగా మారతాయి. ఆముదాన్ని జుట్టుకి పట్టిస్తే పోషకాలు అంది చుండ్రూ, ఇతరత్రా సమస్యలను రానివ్వదు. కురులూ ఆరోగ్యంగా ఉంటాయి.
  • గోళ్లు పొడిబారి, వాటి మధ్యలో గీతలు పడ్డాయా? అయితే, రోజుకోసారి గోరువెచ్చని ఆముదంలో కాసేపు నాననివ్వండి. తరచూ ఇలా చేస్తుంటే వాటికి తగిన పోషణ అంది పెళుసుబారకుండా ఉంటాయి. ఆముదాన్ని పాదాలకు రాస్తే పగుళ్లు రాకుండా, మెత్తగా తయారవుతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్