బూట్లే బాగుంటాయి మరి...

వార్డ్‌రోబ్‌లో దుస్తులెన్ని రకాలున్నా... బూట్లు మాత్రం తక్కువే ఉంటాయి. అలాగని అన్నింటి మీదకూ ఒకేరకం నప్పవు. ముఖ్యంగా ఫ్యూజన్‌, వెస్ట్రన్‌ స్టైల్స్‌ విషయంలో ఈ ఇబ్బంది ఎక్కువ. దాన్ని అధిగమించడానికే ఈ చిట్కాలు.. ఇవి రెండూ చూడ్డానికి దగ్గర దగ్గరగా ఉన్నప్పటికీ తయారీలో తేడా ఉంటుంది.

Published : 04 Dec 2023 01:12 IST

వార్డ్‌రోబ్‌లో దుస్తులెన్ని రకాలున్నా... బూట్లు మాత్రం తక్కువే ఉంటాయి. అలాగని అన్నింటి మీదకూ ఒకేరకం నప్పవు. ముఖ్యంగా ఫ్యూజన్‌, వెస్ట్రన్‌ స్టైల్స్‌ విషయంలో ఈ ఇబ్బంది ఎక్కువ. దాన్ని అధిగమించడానికే ఈ చిట్కాలు..

ఎస్పాడ్రిల్లెస్‌ లేదా లోఫర్స్‌ : ఇవి రెండూ చూడ్డానికి దగ్గర దగ్గరగా ఉన్నప్పటికీ తయారీలో తేడా ఉంటుంది. ఎస్పాడ్రిల్లెస్‌ని అడుగున సోల్‌తో సహా జ్యూట్‌తో తయారు చేస్తారు. లెదర్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ మెటీరియల్స్‌తో లోఫర్స్‌ని తయారు చేస్తారు. ఇవి ఆఫీస్‌ వేర్‌గా బాగుంటాయి. జీన్స్‌, వదులుగా ఉండే షర్టులకు జతగా ఎంచుకోవచ్చు. స్నీకర్స్‌, కాన్వాస్‌ షూలకు బదులుగానూ వీటిని ఎంచుకోవచ్చు.

స్నీకర్స్‌, స్పోర్ట్స్‌షూస్‌: మనలో ఎక్కువమంది వీటిని వాకింగ్‌కి వెళ్లేప్పుడూ, వ్యాయామాలు చేసేటప్పుడూ ఎంచుకుంటారు. అయితే, వీటిని వెస్ట్రన్‌, ఫ్యూజన్‌ వేర్‌కి జతగానూ ఎంచుకోవచ్చు.

క్లాగ్స్‌: ఈ మధ్య బాగా ట్రెండింగ్‌లో ఉన్న రకం ఇవి. ఎక్కువగా చిన్నపిల్లలకోసం ఎంచుకుంటుంటారు. అడుగున సోల్‌ మందంగా, ముందు భాగం మూసి ఉంటుంది. ఇవి లూజు ప్యాంట్లూ, పలాజోలూ, స్కర్టులూ, క్యాప్రీల మీదకు నప్పుతాయి.

ఫ్లాట్‌ షూస్‌: స్కిన్నీ ప్యాంట్లు, కాఫ్‌లెంగ్త్‌, నీ లెంగ్త్‌ గౌనులు, జీన్సులు, స్కర్టుల మీదకు ఇవి సరైన ఎంపిక. పొడవుగా ఉండేవారు వీటిని ఎంచుకోవడం వల్ల మరీ ఎత్తుగా కనిపించరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్