జుట్టుకు రాత్రిపూట నూనెవద్దు...

మనలో చాలామంది రాత్రి నిద్రపోయే ముందు జుట్టుకు నూనె రాస్తారు. కొందరు ఎప్పుడూ నూనెపెట్టుకునే ఉంటారు. ఇలా చేస్తే మేలుకన్నా జుట్టు రాలిపోయే ప్రమాదమే ఎక్కువ.. జుట్టుకు రాత్రిపూట నూనె రాసుకుని మరుసటి రోజు ఉదయం షాంపూతో స్నానం చేస్తుంటాం. ఎంత ఎక్కువ సేపు నూనెతో ఉంటే అన్ని పోషకాలు అనుకుంటాం.

Published : 04 Dec 2023 01:17 IST

మనలో చాలామంది రాత్రి నిద్రపోయే ముందు జుట్టుకు నూనె రాస్తారు. కొందరు ఎప్పుడూ నూనెపెట్టుకునే ఉంటారు. ఇలా చేస్తే మేలుకన్నా జుట్టు రాలిపోయే ప్రమాదమే ఎక్కువ..

  • జుట్టుకు రాత్రిపూట నూనె రాసుకుని మరుసటి రోజు ఉదయం షాంపూతో స్నానం చేస్తుంటాం. ఎంత ఎక్కువ సేపు నూనెతో ఉంటే అన్ని పోషకాలు అనుకుంటాం. ఇలా చేస్తే జుట్టుకు పోషణ అందదు సరికదా, మురికి పేరుకుపోతుంది. జుట్టుకు నూనె పెట్టిన రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే చాలు.
  • చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు తలపై నూనె పెట్టొద్దు. ఇలా చేస్తే సమస్య రెట్టింపవుతుంది. బదులుగా హెయిర్‌ ప్యాక్‌లను ఉపయోగించండి.
  • చాలామంది జుట్టు రాలుతుంది అంటే ఎక్కువ మొత్తంలో నూనెను రాస్తుంటారు. ఇదే చికిత్స అనుకుంటారు. కానీ జుట్టు రాలడానికి కారణం హార్మోన్ల హెచ్చుతగ్గులు, సరైన పోషకాలు అందకపోవడం. కేవలం జుట్టు పొడిగా మారినప్పుడు మాత్రమే నూనె రాస్తే సరిపోతుంది. అది కూడా తగినంత.
  • ఏదైనా మితిమీరి చేయకూడదు. చాలామంది హాయిగా ఉంది కదా అని నూనె రాసుకున్నప్పడల్లా గంటల కొద్ది మసాజ్‌లు చేయించుకుంటుంటారు. ఇలా చేయడం సరైనది కాదు. దీని వల్ల కుదుళ్లు బలహీనమవుతాయి. ఎక్కువసేపు కురులను తాకడం వల్ల అవి రాలిపోయే అవకాశమూ ఉంటుంది. అందుకే ఆయిల్‌ మసాజ్‌ను నెలకోసారి చేయించుకుంటే చాలు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్