సహజంగా.. యవ్వనం!

ముఖంపై ముడతలు.. వయసు మళ్లినాక ఎలాగూ తప్పదు. మూడు పదుల వయసులో పలకరిస్తోంటేనే దిగులు.  వాటికి చెక్‌ పెట్టడానికి ఏవేవో క్రీములు రాస్తున్నారా? వీటినోసారి ప్రయత్నించి చూడండి..

Published : 05 Dec 2023 01:13 IST

ముఖంపై ముడతలు.. వయసు మళ్లినాక ఎలాగూ తప్పదు. మూడు పదుల వయసులో పలకరిస్తోంటేనే దిగులు.  వాటికి చెక్‌ పెట్టడానికి ఏవేవో క్రీములు రాస్తున్నారా? వీటినోసారి ప్రయత్నించి చూడండి..

  • అశ్వగంధ.. చర్మానికి సరైన పోషకాలు అందకే వృద్ధాప్యఛాయలు అనుకుంటాం. కానీ.. దీనికి నిద్రలేమి, ఒత్తిడి వంటివీ కారణాలే. అశ్వగంధ నూనెను రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి, మెడకి రాసి మర్దన చేయండి. సువాసన ఒత్తిడిని దూరం చేసి, సుఖనిద్రను కలిగిస్తే.. యాంటీఆక్సిడెంట్లు చర్మానికి పోషణను అందించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
  • పసుపు.. అందాన్ని పెంచడంలో పసుపుది ప్రత్యేక పాత్రే. కాలుష్యం కారణంగా చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు, మచ్చలు, యాక్నే వంటి సమస్యలకు దారి తీస్తాయి. చర్మం కూడా నిర్జీవంగా తయారై వయసుకి మించి కనిపిస్తుంటాం. రెండు చెంచాల పచ్చిపాలల్లో చిటికెడు పసుపు, రెండు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకి రాసి ఆరాక చల్లని నీటితో కడిగేస్తే సరి. దీనిలోని కర్కుమిన్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి.
  • సరస్వతీ ఆకు.. ఆయుర్వేదంలో దీనిది ప్రత్యేకస్థానం. దీనిలోని పోషకాలు కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. మృతకణాలను తొలగించి చర్మానికి మెరుపునిస్తాయి. చెంచా సరస్వతీ ఆకు పొడికి అర చెంచా చొప్పున తేనె, మందార పూల పొడి, తగినంత గులాబీ నీరు కలిపి శుభ్రమైన ముఖానికి పూత వేయాలి. పావు గంటయ్యాక చల్లటి నీటితో కడిగేస్తే సరి.
  • ఉసిరి.. చెంచా ఉసిరిపొడిలో చిటికెడు గంధం, తగినన్ని రోజ్‌వాటర్‌ కలిపి పేస్టులా చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న ముఖానికి పట్టించి ఆరాక చల్లటి నీటితో కడిగితే చాలు. యాక్నే ఉన్నవారు ప్రయత్నిస్తే సరి. దీనిలోని సి విటమిన్‌ మొటిమలను నయం చేయడమే కాదు.. కొలాజెన్‌నూ వృద్ధి చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్