నల్లటి వలయాలకు ఇంటి ప్యాకులు!

ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత కారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. ప్రారంభంలోనే వీటిని గుర్తించి.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. అందుకు ఉపకరించే ఇంటి చిట్కాలివి.

Published : 06 Dec 2023 01:50 IST

ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత కారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. ప్రారంభంలోనే వీటిని గుర్తించి.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. అందుకు ఉపకరించే ఇంటి చిట్కాలివి..

బంగాళాదుంపలు: వీటిలో చర్మానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్ల చుట్టూ ఉన్న నలుపును తగ్గిస్తాయి. ఈ దుంపల్ని సన్నని చక్రాల్లా తరిగి కళ్లపై పది నిమిషాలు ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయండి. ఇలా రోజూ చేస్తే ఫలితం ఉంటుంది.

పుదీనా: ఈ ఆకుల్లో మిథనాల్‌ ఉంటుంది. దీనికి చర్మాన్ని తాజాగా ఉంచే గుణం ఉంది. అలాగే కళ్లకింద నల్లని వలయాలకూ, ముడతలకూ ఇది చక్కని మందు. గుప్పెడు పుదీనా ఆకులను చూర్ణం చేసి కళ్లకింద పలుచగా రాయాలి. ఐదు నిమిషాలుంచి ఆపై చన్నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి.

పసుపు: దీనిలో కర్క్యుమిన్‌ అనే ప్రత్యేక రసాయనం ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతిమంతంగా మెరిసేలా చేస్తుంది. అలానే హైపర్‌ పిగ్మెంటేషన్‌ సమస్యను పరిష్కరించి నల్లటి వలయాలను తగ్గిస్తుంది. అరచెంచా పసుపులో సరిపడా బాదం నూనె వేసి పేస్ట్‌లా చేసి రాసుకోవాలి. పావుగంట తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తూ ఉంటే నల్లటి వలయాలకు చెక్‌ పెట్టొచ్చు.

పాలు మేలు: పాలల్లోని లాక్టిక్‌ యాసిడ్‌ చర్మానికి మేలు చేస్తుంది. కంటికింద వలయాలను, ముడతలను మాయం చేస్తుంది. పాలల్లో ముంచిన దూదితో కంటికింద మృదువుగా రుద్దాలి. 15 నిమిషాల తర్వాత నీటితో కడిగేస్తే సరి.

ఐప్యాక్‌: నల్లటి వలయాలను తగ్గించటంలో ఈ ప్యాక్‌ బాగా ఉపయోగపడుతుంది. నాలుగు చుక్కల నిమ్మరసం, అరచెంచా కొబ్బరినూనె, చెంచా దోసగుజ్జును తీసుకోండి. వీటిని కలిపి కంటి కింద రాసి.. పది నిమిషాలు మసాజ్‌ చేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేస్తే చాలు. వారానికోసారి చేసినా ఫలితం కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్