అధరాల అందానికి..

లిప్‌స్టిక్‌ వేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి. చూడ్డానికి బాగుండటమే కాదు ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది..

Updated : 07 Dec 2023 05:32 IST

లిప్‌స్టిక్‌ వేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి. చూడ్డానికి బాగుండటమే కాదు ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది..

  • తమ చర్మ ఛాయ, ఆకృతుల్ని బట్టి కాకుండా కంటికి నచ్చిన ఏదో ఒక రంగుని ఎంచుకుంటూ ఉంటారు. అలా చేయొద్దు. పెదవులు పల్చగా, చిన్నగా ఉంటే ముదురు రంగులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ పెదాలు దళసరిగా ఉంటే.. లేత ఛాయల్ని ఎంచుకోవాలి. రంగు తక్కువ ఉన్నవారు డీప్‌రెడ్‌, పర్పుల్‌, బ్రౌన్‌, వంటి ముదురు ఛాయల్ని వాడితే మేలు. తెల్లగా ఉన్నవారికి న్యూట్రల్‌, లేతరంగులు బాగుంటాయి.
  • సాధారణంగా లిప్‌స్టిక్‌, లిప్‌గ్లాస్‌ చివరిగా వేసి అలంకరణ ముగిస్తారు. ఇలా చేస్తే పెదాలు మెరిసిపోతూ.. మిగతా అలంకరణని డామినేట్‌ చేస్తాయి. అందుకే అలంకరణ ప్రారంభంలోనే లిప్‌స్టిక్‌ వేస్తే మేకప్‌ అంతా పూర్తయ్యేసరికి కాస్త మెరుపు తగ్గుతుంది. పెదవులు సహజంగా కనిపిస్తాయి.
  • లిప్‌స్టిక్‌ వేశాక.. పెదవులపై టిష్యూతో అద్దేస్తే సరి. అప్పుడు అదనంగా ఉన్న లిప్‌స్టిక్‌ ఆ కాగితానికి అంటుకుంటుంది. పెదవులు ఎక్కువసేపు తాజాగా కనిపిస్తాయి.
  • చాలామంది ముఖంపై చూపించే శ్రద్ధ పెదవులపై పెట్టరు. దాంతో పెదాలపై మృతకణాలు పేరుకుని నిర్జీవంగా కనిపిస్తాయి. పొడిబారిన ఆ పెదాలపై లిప్‌స్టిక్‌ వేసుకుంటే అందం పెరగదు సరికదా చూడ్డానికీ బాగోదు.

వారానికోసారి టూత్‌పేస్టులో చక్కెర కలిపి పెదవులపై రుద్దుకుంటే సరి. ఆపై కాస్త తేనె రాస్తే తేమ అంది, తాజాగా కనిపిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్