తాజాదనం ఎక్కువసేపు..

ఎంత మదిదోచే పెర్‌ఫ్యూమ్‌ అయినా... కాసేపటికే దాని ప్రభావం తగ్గిపోతుంది. అలా కాకుండా ఎక్కువసేపు పరిమళాలు వెదజల్లుతూ... మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచాలంటే..

Updated : 08 Dec 2023 01:47 IST

ఎంత మదిదోచే పెర్‌ఫ్యూమ్‌ అయినా... కాసేపటికే దాని ప్రభావం తగ్గిపోతుంది. అలా కాకుండా ఎక్కువసేపు పరిమళాలు వెదజల్లుతూ... మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచాలంటే..

  • చెవుల వెనక: ఇక్కడ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. సువాసన నిలిచి ఉండాలన్నా, వ్యాపించాలన్నా పరిమళాన్ని అక్కడ స్ప్రే చేయాలి. పార్టీలు, వేడుకలప్పుడు.. ఆత్మీయులతో కాస్త దగ్గరగా మసులుతుంటాం కాబట్టి ఈ విధంగా ప్రయత్నించి చూడండి. అలాగని అతిగా ఉపయోగించొద్దు. చర్మానికి హాని కలగొచ్చు. తలనొప్పి వంటి సమస్యలూ ఎదురవుతాయి.
  • మెడ చుట్టూ: ఇక్కడ రక్తనాళాలు చర్మ ఉపరితలానికి దగ్గరగా ఉంటాయి. అందుకే మెడ దగ్గర స్ప్రే చేస్తే పరిమళం చక్కగా వ్యాపిస్తుంది.. ఎక్కువ సేపు ఆ తాజాదనం నిలిచి ఉంటుంది. కానీ రాళ్లు పొదిగిన ఆభరణాలపై పడితే వాటి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది.
  • మణికట్టు: చర్మం సున్నితంగా ఉంటుందిక్కడ. ఇక్కడ పెర్‌ఫ్యూమ్‌ రాసి, రుద్దితే.. చేతి కదలికల వల్ల సువాసన వ్యాపిస్తుంది. రోజంతా తాజాగా ఉన్న భావన కలుగుతుంది.
  • మోకాళ్ల వెనక: ఈ ప్రాంతంలో వెచ్చగా ఉంటుంది. ఇక్కడ స్ప్రే చేస్తే సువాసన చుట్టుపక్కలకు సులభంగా వ్యాపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్