తువ్వాలా? హెయిర్‌ డ్రయ్యరా?

తలను సహజంగానే ఆరబెట్టుకోవాలి లేదంటే కురులు రాలిపోతాయంటారు కొందరు. లేదు లేదు తువ్వాలుతో తుడిస్తే జుట్టు గడ్డిలా కనిపిస్తుంది. పైగా ఆరడానికి చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి డ్రయ్యరే మేలంటారు మరికొందరు. ఇంతకీ రెండిట్లో ఏది ఎంచుకోవడం మేలు?

Updated : 14 Feb 2024 04:26 IST

తలను సహజంగానే ఆరబెట్టుకోవాలి లేదంటే కురులు రాలిపోతాయంటారు కొందరు. లేదు లేదు తువ్వాలుతో తుడిస్తే జుట్టు గడ్డిలా కనిపిస్తుంది. పైగా ఆరడానికి చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి డ్రయ్యరే మేలంటారు మరికొందరు. ఇంతకీ రెండిట్లో ఏది ఎంచుకోవడం మేలు?

ఈ వాదన నాణేనికి మరోవైపు లాంటిదే. సరిగా వాడటం తెలియకపోతే రెండింటితోనూ సమస్యలొస్తాయి. కాబట్టి... ఒక్కదానిపైనే ఆధారపడొద్దు. రెండింటి ప్రయోజనాలు అందుకోవడం మేలంటారు నిపుణులు.

  • తువ్వాలుతో తుడుచుకోవడం మంచిదే! అయితే అది గరుకుగా ఉండేదైతే మాడుతోపాటు కురుల కుదుళ్లపైనా చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఉపయోగించేది మెత్తని కాటన్‌ టవలేనా అన్నది చూసుకోవాలి. ఇదైతే త్వరగా నీటిని పీల్చుకుంటుంది. అయితే దీంతోనైనా గట్టిగా రుద్దడం, దులుపుతున్నట్లుగా చేయడం లాంటివి వద్దు.
  • నీరు కారడం పూర్తిగా ఆగిపోయాక డ్రయ్యర్‌తో ఆరబెడితే సరి. జుట్టూ కుచ్చులుగా కనిపిస్తుంది. అయితే డ్రయ్యర్‌ని మాడుకి మరీ దగ్గరగా ఉంచొద్దు. హీట్‌ కాకుండా కూల్‌ మోడ్‌లో పెట్టి వాడితే   ఇంకా మంచిది.
  • ఆరబెట్టడం సులువు అవుతుందనో, అలల్లా కనిపిస్తుందనో కొందరు దువ్వెనతో దువ్వుతూ డ్రయ్యర్‌తో ఆరబెడుతుంటారు. ఇదీ ప్రమాదమే. తడిగా ఉన్న కురులు త్వరగా ఊడే ప్రమాదం ఉంది. చాలావరకూ ఆరాక మాత్రమే దువ్వెన తలలో పెట్టాలి.
  • జలుబు వస్తుందనీ కొందరు డ్రయ్యర్లవైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడెలాగూ వేసవే! వేగంగానే ఆరుతుంది కాబట్టి, సహజ పద్ధతికే ఓటేయడం మేలు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్