ఫిట్‌నెస్‌ డేట్‌... ఇప్పుడిదే ట్రెండ్‌!

అమ్మాయి, అబ్బాయి ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకోవడానికి ఫాలో అయ్యే పద్ధతి క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. అందరూ యాక్టివిటీ బేస్‌డ్‌ డేట్‌కే మొగ్గుచూపుతున్నారు. అవేంటంటారా!

Updated : 14 Feb 2024 04:24 IST

అమ్మాయి, అబ్బాయి ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకోవడానికి ఫాలో అయ్యే పద్ధతి క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. అందరూ యాక్టివిటీ బేస్‌డ్‌ డేట్‌కే మొగ్గుచూపుతున్నారు. అవేంటంటారా!

కొవ్వొత్తుల కాంతుల్లో నచ్చిన ఆహారం ఆర్డర్‌ చేసుకుని మాట్లాడుకుంటూ ఇష్టాయిష్టాలను తెలుసుకోవటం... ఇప్పటి వరకూ ఓ రొమాంటిక్‌ డేట్‌. అయితే నేటి తరానికి అది బోర్‌ కొట్టేసింది. అసలే ఒకరికొకరు కొత్త... అలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ గంటల కొద్దీ ఏం కూర్చుంటారు చెప్పండి! పైగా మొదటి మీటింగ్‌లోనే చర్చలు... ఒక్కోసారి ఏం మాట్లాడాలో తెలియని నిశ్శబ్ద వాతావరణం... ఈ ఇబ్బందికర పరిస్థితుల కంటే ఏదైనా ఎంగేజింగ్‌ యాక్టివిటీల్లో భాగమైతే వారి గురించి మరింత లోతుగా తెలుసుకునే అవకాశం ఉందని యువ జంటలు భావిస్తున్నాయి. అందుకే ఎదుటివారి ఆసక్తులేంటో తెలుసుకుని మరీ డేట్‌ ప్రణాళికలు వేసుకుంటున్నారు. దాంతో జిమ్‌, యోగా, ఫిట్‌నెస్‌ సెంటర్లే యువతకి డేటింగ్‌ లొకేషన్లు. రన్నింగ్‌, సైక్లింగ్‌, ట్రెక్కింగ్‌లే ప్రేమ పక్షులకు సుందర ప్రదేశాలు. దీన్నే ఫేటింగ్‌ లేదా ఫిట్‌నెస్‌ డేటింగ్‌ అంటారు. సినిమాలు, వంట పాఠాలు, కార్నివాల్స్‌, స్టాండప్‌ కామెడీలు, వాకింగ్‌, సిటీ టూర్‌ అంటూ ఇద్దరూ కలిసి సరదాగా గడపడానికీ ఇష్టపడుతున్నారు. చెస్‌, స్నూకర్‌, షూటింగ్‌... లాంటి ఆటల్ని కలిసి ఆడేస్తున్నారు. అందులో ప్రత్యేకత ఏముందంటారా! ఇలా వాళ్లతో కలిసి ఆడేటప్పుడు వాళ్లలోని బలాలేంటి? గెలుపోటములను ఎలా తీసుకుంటున్నారు? వారి ప్రాధాన్యతలేంటి... అనే విషయాలు తెలుస్తాయి. త్వరగా ఓ అంచనాకు రావొచ్చు అనేస్తున్నారీ తరం అమ్మాయిలు. ఈ ట్రెండింగ్‌ డేట్‌ను మీరూ ప్రయత్నిస్తారా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్