బ్లవుజు... ముడివేసేద్దాం

ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌ దుస్తుల్ని ఎంచుకోవడంలో మహిళలు ముందుంటారు. వారి అభిరుచులకు తగ్గట్టుగానే కొత్త కొత్త డిజైన్లూ మార్కెట్లోకి వస్తున్నాయి.

Updated : 16 Feb 2024 03:25 IST

ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌ దుస్తుల్ని ఎంచుకోవడంలో మహిళలు ముందుంటారు. వారి అభిరుచులకు తగ్గట్టుగానే కొత్త కొత్త డిజైన్లూ మార్కెట్లోకి వస్తున్నాయి. పైగా ఇటీవలి కాలంలో చీర ఏదైనా జాకెట్‌ మాత్రం ఆధునికంగా కనిపించాలి అన్నది ట్రెండ్‌గా మారింది. అందుకే రోజుకో బ్లవుజు ఫ్యాషన్‌ మార్కెట్లోకి వస్తోంది. అందులో భాగంగా నిన్నమొన్నటి వరకు హైనెక్‌, బోట్‌నెక్‌, డీప్‌నెక్‌ రకాలతో పాటు ఎంబ్రాయిడరీ, టాసెల్స్‌ హవా నడిచింది. ప్రస్తుతం ఈ ‘బ్యాక్‌ నాట్‌ బ్లవుజు’లు తెగ నచ్చేస్తున్నాయి. వెనుకభాగం డీప్‌ వీ ఆకారంలో వచ్చి రిబ్బన్‌తో ముడి వేసిన ఈ బ్లవుజులు వేసుకుని మురిసిపోతున్నారు. పార్టీ, ఫంక్షన్‌, పెళ్లి వంటి సందర్భాల్లో స్టైలిష్‌ ట్రెండీ లుక్‌ కోసం ఈ నాట్‌ బ్లవుజ్‌ మంచి ఎంపిక. ఇంకెందుకు ఆలస్యం మీరూ ప్రయత్నించేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్