అందమైన చర్మం కోసం..!

మచ్చల్లేని చర్మంతో ఉండాలని ఎవరికుండదు.. కానీ చర్మంపై అక్కడక్కడా వచ్చే తెల్లమచ్చలు అందాన్ని పాడుచేస్తాయి. శరీరంలో మెలనిన్‌ ఉత్పత్తి తక్కువ కావడంతో ఈ మచ్చలు ఏర్పడుతుంటాయి. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా నివారించవచ్చు.

Published : 16 Feb 2024 01:58 IST

మచ్చల్లేని చర్మంతో ఉండాలని ఎవరికుండదు.. కానీ చర్మంపై అక్కడక్కడా వచ్చే తెల్లమచ్చలు అందాన్ని పాడుచేస్తాయి. శరీరంలో మెలనిన్‌ ఉత్పత్తి తక్కువ కావడంతో ఈ మచ్చలు ఏర్పడుతుంటాయి. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా నివారించవచ్చు.

దానిమ్మ తొక్కలు.. చెంచా దానిమ్మ తొక్కల పొడికి అదే పరిమాణంలో రోజ్‌వాటర్‌ను కలిపి ముఖానికి రాయాలి. పావుగంటాగి చల్లటి నీటితో కడిగి శుభ్రం చేస్తే సరి. ఇది చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్‌ చేస్తుంది. దురద, యాక్నే నుంచి రక్షణ కల్పించి ముఖాన్ని మెరిపిస్తుంది. మచ్చలనీ తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.

టీ ట్రీ ఆయిల్‌.. చర్మంపై మచ్చలు, మురికిని తొలగించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ఇందులోని యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు చర్మాన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. శరీరం నుంచి వెలువడే చెమట బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. దీని కారణంగా అనేక చర్మ సమస్యలు కలుగుతాయి. ఇలా కాకూడదంటే టేబుల్‌స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌కి అదే పరిమాణంలో కొబ్బరి నూనె, పదిచుక్కల టీ ట్రీ ఆయిల్‌ కలిపి ముఖాన్ని మృదువుగా మర్దన చేయాలి. అరగంటాగి గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరచాలి. ఇలా రోజూ రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

కొబ్బరినూనె.. ఇందులో యాంటీ మైక్రోబియల్‌ లక్షణాలు పుష్కలం. ఇవి చర్మంపై ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లను తొలగించి ముఖాన్ని మెరిపిస్తాయి.  రోజూ నిద్రించే ముందు రాస్తే... తగిన తేమ అంది చర్మం నిగనిగలాడుతుంది.

నిమ్మ, చక్కెర స్క్రబ్‌.. చెంచా చక్కెరకి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి సమస్య ఉన్న చోట రాయాలి. నిమ్మలోని సి విటమిన్‌ పీహెచ్‌ స్థాయుల్ని సమతుల్యం చేస్తుంది. తెల్లమచ్చలను నివారిస్తుంది. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి తగినంత తేమను అందించి మెరిసేలా చేస్తాయి.

చందనం, రోజ్‌వాటర్‌ మాస్క్‌.. తగినంత చందనం పొడికి సరిపడా గులాబీనీరు కలిపి మెత్తని పేస్టు చేసుకోవాలి. దీన్ని తెల్లమచ్చలున్న చోట రాసి ఆరాక చల్లటి నీటితో శుభ్రం చేస్తే సరి. గంధంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖాన్ని తేమగా కాంతిమంతంగా కనిపించేలా చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్