అరచేత విరిసిన తామర..!

కొమ్మ లేకుండానే గోరింటాకు పండుతుందని ఓ కవి చెప్పినట్లు... అరచేతి కొలనులో తామర విరియడానికి నీరు అవసరం లేదేమో అనిపిస్తోంది... ఈ డిజైన్లను చూస్తుంటే. వివాహ సమయంలో గోరింటాకు డిజైన్స్‌ ఎంపికలో వధువు చేతికి నిండుదనం వచ్చేలా గతంలో ప్రాముఖ్యతనిచ్చేవారు.

Updated : 17 Feb 2024 07:14 IST

కొమ్మ లేకుండానే గోరింటాకు పండుతుందని ఓ కవి చెప్పినట్లు... అరచేతి కొలనులో తామర విరియడానికి నీరు అవసరం లేదేమో అనిపిస్తోంది... ఈ డిజైన్లను చూస్తుంటే.

వివాహ సమయంలో గోరింటాకు డిజైన్స్‌ ఎంపికలో వధువు చేతికి నిండుదనం వచ్చేలా గతంలో ప్రాముఖ్యతనిచ్చేవారు. ఇప్పుడు మనసుకు నచ్చిన అభిరుచితోపాటు పరమార్థానికి కూడా పెద్దపీట వేస్తున్నారు. అందులో భాగంగా దేవతామూర్తుల అలంకరణలో స్థానాన్ని పొందిన తామరను అరచేత పండించుకుంటున్నారు. స్వచ్ఛతకీ, పవిత్రతకీ ప్రతిరూపంగా పిలిచే తామరపూలు గోరింటాకు రూపంలో తమ చెంత ఉన్నట్లు అనుభూతి చెందుతున్నారు. చేతి నిండా విరిసీవిరియని తామరలను నింపేస్తూ.. వాటిని తీగలకు కలుపుతూ, హంసలను జోడిస్తూ, విచ్చుకున్న పూల డిజైన్‌ మధ్య కాబోయే భర్త పేరు రాసుకొని మరీ మురిసిపోతున్నారు. నవ వధువు చేతికి నిండుదనాన్నిచ్చే గోరింటాకులో విరిసిన ఈ పూల దీవెనలూ నిండి ఉంటాయనిపిస్తుంది కదూ..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్