మొటిమలా... ఇవొద్దు!

అందమైన ముఖానికి చిన్న మొటిమ చాలదూ... కళ తప్పడానికి? పైగా నొప్పి. పోనీ వచ్చింది వచ్చినట్టు పోతుందా అంటే అదీ ఉండదు. మచ్చను మిగులుస్తుంది. వచ్చాక క్రీములు రాయడం కంటే, రాకుండా చూసుకుంటే?

Published : 19 Feb 2024 01:56 IST

అందమైన ముఖానికి చిన్న మొటిమ చాలదూ... కళ తప్పడానికి? పైగా నొప్పి. పోనీ వచ్చింది వచ్చినట్టు పోతుందా అంటే అదీ ఉండదు. మచ్చను మిగులుస్తుంది. వచ్చాక క్రీములు రాయడం కంటే, రాకుండా చూసుకుంటే?

డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వీటిల్లోని ప్రొటీన్స్‌, ఫ్యాట్‌ యాక్నేకి కారణమవుతాయి. పాలు లేకుండా ఉండలేమనిపిస్తే సోయా, బాదం, ఓట్‌ మిల్క్‌, యోగర్ట్‌ వంటివి ప్రయత్నిస్తే మేలు.

  • అమ్మాయిలు, తీపి పదార్థాలను విడదీయలేం కదూ! కానీ స్వీట్లు, పేస్ట్రీలతో అదనపు కొవ్వులు వచ్చి చేరతాయి. అంతేనా... వీటిల్లోని చక్కెర ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమై మరిన్ని మొటిమలు వచ్చేలా చేయగలదు. కాబట్టి, తీపికి కళ్లెం వేయాల్సిందే. బదులుగా బెల్లంతో చేసినవి తీసుకోండి. కొద్దిమొత్తంలో డార్క్‌ చాక్లెట్‌ వరకూ తినొచ్చు.
  • మాంసప్రియులా? దాన్నీ వీలైనంత తక్కువ తినాల్సిందే! మాంసంలో అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవీ మొటిమలకు కారణమయ్యేవే. కావాలంటే మష్రూమ్‌, చేపలు ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకా ఎ, సి, ఇ విటమిన్లు ఎక్కువగా లభించే యాపిల్‌, బొప్పాయి, సిట్రస్‌ ఫలాలకు అధిక ప్రాధాన్యమివ్వాలి. అలాగని జ్యూసులు కాదు, నేరుగా పండ్లనే తింటే మేలు. అలాగే స్ట్రాబెర్రీ, ఎండిన బెర్రీ ఫలాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే చర్మానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్