ప్యాంటు సూట్‌... లుక్‌ అదుర్స్‌..!

హుందాగా, స్టైలిష్‌గా కనిపించాలంటే అమ్మాయిల మొదటి ఎంపిక ప్యాంట్‌ సూట్‌లే. ఒకప్పటి సంప్రదాయ సూట్‌లకే కొత్త హంగులు జోడించేస్తున్నారు డిజైనర్లు. ఆఫీస్‌కీ, బిజినెస్‌ మీటింగ్‌లకూ, వెడ్డింగ్‌, పార్టీ, సోషల్‌ ఈవెంట్లకు తగ్గట్లు మోనోక్రోమ్‌, ఫార్మల్‌, సెమీ ఫార్మల్‌, సీక్విన్స్‌, ఫ్లోరల్‌ ప్రింట్స్‌..వంటి రకాలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు.

Published : 19 Feb 2024 01:57 IST

హుందాగా, స్టైలిష్‌గా కనిపించాలంటే అమ్మాయిల మొదటి ఎంపిక ప్యాంట్‌ సూట్‌లే. ఒకప్పటి సంప్రదాయ సూట్‌లకే కొత్త హంగులు జోడించేస్తున్నారు డిజైనర్లు. ఆఫీస్‌కీ, బిజినెస్‌ మీటింగ్‌లకూ, వెడ్డింగ్‌, పార్టీ, సోషల్‌ ఈవెంట్లకు తగ్గట్లు మోనోక్రోమ్‌, ఫార్మల్‌, సెమీ ఫార్మల్‌, సీక్విన్స్‌, ఫ్లోరల్‌ ప్రింట్స్‌..వంటి రకాలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఇవి మనకు హుందాతనంతోపాటు, కాన్ఫిడెంట్‌ లుక్‌నీ ఇస్తాయి. అందుకే ఫ్యాషన్‌ ప్రియుల వార్డ్‌రోబ్‌లలో ఇవి తప్పనిసరి. తాజాగా నటి ఆలియాభట్‌ ఓ ఈవెంట్‌లో వేసుకున్న ‘గ్రీన్‌ డెన్వర్‌ గ్రేడియంట్‌’ చిక్‌ ఓంబ్రే ప్యాంట్‌సూట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీ షేప్‌ కాలర్‌ నెక్‌, ఫుల్‌ స్లీవ్స్‌, షైనింగ్‌ గోల్డ్‌ మెటాలిక్‌ బటన్లతో ట్రెండీగా డిజైన్‌ చేసిన ఓంబ్రే బ్లేజర్‌కు వైడ్‌ లెగ్‌డ్‌ ప్యాంట్‌ను జతచేసిన ఆలియా ఈ అవుట్‌ఫిట్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఇంతకీ దాని ధర ఎంతో తెలుసా రూ.3లక్షలకు పైమాటే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్