సిరిమంతురాళ్లకు.. సరికొత్త కంటె!

తరాలెన్ని మారినా... అమ్మలు, బామ్మల నగలంటే మోజు పడని అమ్మాయి ఉండదు. పేరుకే పాతవి కానీ, వాటిల్లో ఉండే హుందాతనం, ఆప్యాయత వాళ్లనలా ఆకర్షిస్తుంటాయి.

Updated : 20 Feb 2024 04:42 IST

రాలెన్ని మారినా... అమ్మలు, బామ్మల నగలంటే మోజు పడని అమ్మాయి ఉండదు. పేరుకే పాతవి కానీ, వాటిల్లో ఉండే హుందాతనం, ఆప్యాయత వాళ్లనలా ఆకర్షిస్తుంటాయి. అందుకే ఆ ప్రేమను గుర్తుచేస్తూ నాటి ఫ్యాషన్లకు సరికొత్త హంగులు అద్దుతుంటారు డిజైనర్లు. అలా ట్రెండుగా మారిన వాటిల్లో ‘కంటె’ ఒకటి. ఒకప్పుడు కాస్త మందంగా, మెడనంతా చుట్టేస్తూ ‘శ్రీమంతురాలు’ అనడానికి గుర్తుగా నిలిచేదీ ఆభరణం. యువతరం అభిరుచులకు తగ్గట్టుగా కాస్త మార్పులు చేసుకున్నా... ఇంకా ఏదో కొత్తదనం కావాలంటున్నారు ఈ తరం అమ్మాయిలు. వారి నాజూకైన మెడలకు తగ్గట్టుగా నాజూకుగా వచ్చాయి కూడా! మోడరన్‌ దుస్తులకు ఇవీ నప్పట్లేదు అనుకున్నారో ఏమో మరింత స్టైలిష్‌గా తయారై వరుసల్లో వచ్చాయిలా! పచ్చలు, కెంపులు, గుత్తపూసలు జోడించుకుని భలే అందంగా ఉన్నాయి కదూ! పట్టు, సాదా చీరలే కాదు, స్కర్ట్‌, షర్టు, ఆఫ్‌ షోల్డర్‌... అంటూ ఏ దుస్తుల మీదకైనా నప్పేస్తున్నాయి. నగలంటే వేడుకలకే కాదు, వేటిమీదకైనా నప్పేయాలనుకునే అమ్మాయిల మనసుల్ని దోచేస్తున్నాయి. ఆ జాబితాలో మీరూ ఉంటే... ప్రయత్నించేయండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్