మేకప్‌ను తొలగిద్దాం..

పెళ్లిళ్లు, పార్టీలు అంటూ మేకప్‌ను వేసుకుంటాం. మరి దాన్ని తొలగించడానికి టిష్యూని వాడి పైపైన తొలగిస్తాం. లేదంటే అలానే నిద్రపోతుంటాం.

Updated : 20 Feb 2024 14:06 IST

పెళ్లిళ్లు, పార్టీలు అంటూ మేకప్‌ను వేసుకుంటాం. మరి దాన్ని తొలగించడానికి టిష్యూని వాడి పైపైన తొలగిస్తాం. లేదంటే అలానే నిద్రపోతుంటాం. ఇలా చేయడంవల్ల మొటిమలు చర్మాన్ని పాడుచేస్తాయి. వీటిని దూరం చేయాలంటే...

  • తేనె సహజమైన మేకప్‌ రిమూవర్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతిమంతంగా చేస్తుంది. రెండు స్పూన్ల తేనె తీసుకుని దానిలో కాటన్‌ బాల్‌ను ముంచి ముఖంపై ఐదు నిమిషాలు మృదువుగా మసాజ్‌ చేసి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరి.
  • పచ్చిపాలల్లో విటమిన్లు, ప్రొటీన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, మేకప్‌నూ తొలగిస్తాయి. పాలల్లో కాటన్‌ బాల్‌ ముంచి పది నిమిషాలు పాటు మర్దన చేసి ఆపై నీటితో శుభ్రం చేయాలి. పాలు సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేసి మెరుపును అందిస్తాయి.
  • ముఖానికి ఆవిరి పట్టి కూడా మేకప్‌ను సులభంగా తొలగించవచ్చు. పదినిమిషాలు ఆవిరిపట్టి... తరవాత కాటన్‌ క్లాత్‌తో ముఖం తుడుచుకుంటే చాలు. చెమటతో పాటు మురికి పోతుంది. మొటిమలు రాకుండా ఉంటాయి.
  • దోసకాయ రసం... ఉబ్బిన కళ్లకు ఉపశమనాన్ని అందించడమే కాదు, సహజ మేకప్‌ రిమూవర్‌గానూ ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమల నుంచి కాపాడటంతోపాటు సహజ క్లెన్సర్‌గా పనిచేస్తాయి. దోసకాయ రసంలో కాటన్‌ బాల్‌ ముంచి చర్మంపై రాసుకోవాలి. తరవాత నీటితో శుభ్రం చేసుకుంటే సరి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్