టీనేజర్లు ఏం వాడొచ్చు?

అడపాదడపా పలకరించే యాక్నే, స్నేహితుల ప్రభావం ఏదైతేనేం... టీనేజర్లలో తెలియకుండానే స్కిన్‌ కేర్‌పై ఆసక్తి మొదలవుతుంది. వీళ్లకి పిల్లలవీ వాడలేము, అలాగని పెద్దవాళ్లవీ సరిపడవు. కాస్త పెద్దయ్యాక స్కిన్‌ కేర్‌ రొటీన్‌ అనుకుంటాం. కానీ, ఇప్పటినుంచే ప్రారంభించొచ్చు అంటారు నిపుణులు.

Published : 21 Feb 2024 01:42 IST

అడపాదడపా పలకరించే యాక్నే, స్నేహితుల ప్రభావం ఏదైతేనేం... టీనేజర్లలో తెలియకుండానే స్కిన్‌ కేర్‌పై ఆసక్తి మొదలవుతుంది. వీళ్లకి పిల్లలవీ వాడలేము, అలాగని పెద్దవాళ్లవీ సరిపడవు. కాస్త పెద్దయ్యాక స్కిన్‌ కేర్‌ రొటీన్‌ అనుకుంటాం. కానీ, ఇప్పటినుంచే ప్రారంభించొచ్చు అంటారు నిపుణులు.

  • హార్మోనుల్లో మార్పులతో చర్మతీరులో మార్పులొస్తాయి. అతిగా విడులయ్యే నూనెలు యాక్నేకి దారితీస్తాయి. మనకు చిన్నవే కానీ వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. పైగా ఇప్పటినుంచి తీసుకునే జాగ్రత్త దీర్ఘకాలంలో సాయపడుతుంది కూడా!
  • మామూలుగానే వీరికి సీబమ్‌ ఎక్కువగా విడుదలవుతుంది. అంతమాత్రాన జిడ్డు చర్మం అనుకోవాల్సిన పనిలేదు. అందుకోసం జిడ్డు, పొడి కాంబినేషన్లలో వాళ్లది ఏ చర్మతీరో  ఒక రోజంతా గమనించండి. దాని ఆధారంగా ఫేస్‌వాష్‌నో సబ్బునో ఎంపిక చేస్తే సరి. ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు తప్పక ముఖం శుభ్రం చేసుకునేలా చూడాలి
  • జిడ్డు చర్మతత్వం అయినా సరే, మాయిశ్చరైజర్‌ తప్పక వాడాలి. లైట్‌ వెయిట్‌ రకాలను ఎంచుకుంటే చర్మానికి తేమా అందుతుంది. యాక్నే కూడా దరిచేరదు. వాటితోపాటు ఎండలో తిరిగే అవకాశముంటే సన్‌స్క్రీన్‌నీ జోడిస్తే సరిపోతుంది.
  • వీళ్ల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి, అలర్జీలు, దురదలకు ఆస్కారమెక్కువ. కాబట్టి, ఉత్పత్తుల్లో ఆల్కహాల్‌, సల్ఫేట్లు, గాఢ రసాయనాలు, కృత్రిమ సువాసనలు లేకుండా చూసుకోవాలి. బీపీఏ, థాలేట్లు, పారాబెన్లు ఉన్నవాటికీ దూరంగా ఉండాలి. బదులుగా ఛమేలీ, కలబంద లాంటివి ఉన్నవి అందిస్తే ఎలాంటి సమస్యలుండవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్