కురులకు కావాలి జాగ్రత్తలు..!

జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌ సమస్యలు, ఒత్తిడి ఇలా... కారణాలెన్నో. దీనికి వ్యాయామం, ధ్యానం, యోగ, మర్దన వంటి వాటితో పాటు కొన్ని జాగ్రత్తలూ పాటించాలంటున్నాయి అధ్యయనాలు.

Updated : 22 Feb 2024 05:37 IST

జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌ సమస్యలు, ఒత్తిడి ఇలా... కారణాలెన్నో. దీనికి వ్యాయామం, ధ్యానం, యోగ, మర్దన వంటి వాటితో పాటు కొన్ని జాగ్రత్తలూ పాటించాలంటున్నాయి అధ్యయనాలు.

  •  మీ స్కాల్ప్‌ రకాన్ని బట్టి సరైన షాంపూని ఎంచుకోవాలి. ఒకవేళ మీది పొడి జుట్టు అయితే తలస్నానం ఎక్కువ చేయకూడదు. అదే నూనె జుట్టు అయితే వారానికి మూడుసార్లు తలస్నానం చేయడం మంచిది. మీరు వాడే షాంపూలో సల్ఫేట్‌, పారాబెన్‌, సిలికాన్‌... వంటి రసాయనాలు లేని వాటిని ఎంపిక చేసుకోవాలి. లేదంటే... ఇవి కురులను పెళుసుగా మార్చి వెంట్రుకలను తెగిపోయేలా చేసే ప్రమాదం ఉంది. తలస్నానం తర్వాత వాడే కండిషనర్‌లో అమైనో ఆమ్లాలు ఉండే వాటి ఎంపిక ఉత్తమం. ఇవి కురులను మృదువుగా మెరిసేలా చేస్తాయి.
  • శిరోజాలు డీహైడ్రేషన్‌ కాకుండా చూసుకోవాలి... చర్మం మాదిరిగానే కురులు కూడా వాటి తేమను కోల్పోతుంటాయి. తలస్నానం చేసేటప్పుడు నీటిని మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా  ఉండేలా చూసుకోవాలి. బాగా వేడినీటితో తలస్నానం చేయడంవల్ల కురులు వాటి సహజ నూనెలను కోల్పోయి. జుట్టు పొడిగా, పెళుసుగా మారుతుంది. వీలైనంత వరకూ గోరువెచ్చని లేదా చల్లటి నీటిని వాడటమే మంచిది.
  • జుట్టు తడిగా ఉన్నప్పుడు తలను దువ్వకూడదు. ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు కురులు ఎక్కువ రాలిపోయే అవకాశం ఉంది. బిగుతుగా జడలు వేసుకునే అమ్మాయిలు. రాత్రి సమయంలోనైనా వదులుగా చేసుకోవాలి.
  • స్ట్రెయినింగ్‌, ఫెర్మింగ్‌, కలర్‌ వేయడం, బ్లో డ్రైయర్‌లు వంటి వాటిని వీలైనంత వరకూ తగ్గించాలి. ఇవి కురులలో ఉండే సహజ తేమను కోల్పోయేలా చేస్తాయి. 
  • కాలుష్యం, ఎండ, గాలిలోని తేమ వంటి వాటివల్ల చివర్లు చిట్లిపోతుంటాయి. కనీసం ఎనిమిది వారాలకోసారైనా దెబ్బతిన్న జుట్టును కత్తిరించాలి. వీటితో పాటు వారానికోసారి తలకు నూనెను పట్టించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్