పాకెట్‌ లుక్‌... అదుర్స్‌!

డిజైనర్‌ అవుట్‌ఫిట్స్‌ అంటే ఏ అమ్మాయికి ఇష్టం ఉండదు. అయితే డ్రెస్‌ ఎంత అందంగా ఉన్నా ఆ ఒక్క విషయం మాత్రం అమ్మాయిలకు చిరాకు తెప్పిస్తుంటుంది... అబ్బాయిల ప్యాంటూ షర్టులకున్నట్లు జేబుల్లేవే అనీ... ఎప్పుడు చూసినా ఈ ఫోన్‌ చేత్తో పట్టుకునే తిరగాలనీ... లేదూ దానికోసం ప్రత్యేకంగా మరో బుల్లి బ్యాగుని తగిలించుకోవాల్సి వస్తుందనీనూ.

Published : 23 Feb 2024 04:18 IST

డిజైనర్‌ అవుట్‌ఫిట్స్‌ అంటే ఏ అమ్మాయికి ఇష్టం ఉండదు. అయితే డ్రెస్‌ ఎంత అందంగా ఉన్నా ఆ ఒక్క విషయం మాత్రం అమ్మాయిలకు చిరాకు తెప్పిస్తుంటుంది... అబ్బాయిల ప్యాంటూ షర్టులకున్నట్లు జేబుల్లేవే అనీ... ఎప్పుడు చూసినా ఈ ఫోన్‌ చేత్తో పట్టుకునే తిరగాలనీ... లేదూ దానికోసం ప్రత్యేకంగా మరో బుల్లి బ్యాగుని తగిలించుకోవాల్సి వస్తుందనీనూ. అందుకే ఈమధ్య కుర్తీలకీ చీరలకీ కూడా జేబులు కుడుతున్నారు. అయితే ఇప్పుడు వీటితోపాటు మోడ్రన్‌వేర్‌ మీదకీ జేబులు అటాచ్‌ చేసేస్తున్నారు. అదీ అవుట్‌ఫిట్‌ డిజైన్‌లో కలిసిపోయేలా... దాంతో ఈ ప్యాకెట్‌వేర్‌ అమ్మాయిలకీ తెగ నచ్చేస్తుందట. పైగా వీటిల్లో వెరైటీలూ బోలెడు.

ముదురు, లేత వర్ణాల్లోని ఏక రంగు ఫ్రాక్‌కు కాంట్రాస్ట్‌ కలర్డ్‌ జేబుని అటాచ్‌ చేస్తున్నారు డిజైనర్లు. పైగా ఇవి మరింత వినూత్నంగా ఉండేలా పూలూ పండ్ల డిజైన్లలో కుడుతున్నారు. అంతేనా... కొన్నింటికి రంగురంగుల దారాలతో ఎంబ్రాయిడరీ చేసిన జేబులూ ఉంటున్నాయి. మరికొన్నింటికి టాసిల్స్‌నీ జత చేస్తున్నారు. సో ఫ్రాక్‌, చుడీదార్‌ టాప్‌, లాంగ్‌ ఫ్రాక్‌... ఇలా డిజైన్‌ ఏదైనా దానిపై ప్రత్యేకంగా అటాచ్‌ చేసే జేబుతో డ్రెస్‌ అందం రెట్టింపు అవ్వాల్సిందే. ఇక, ఈ జేబుల్లో చేయి ఉంచి స్టైల్‌గా అడుగేస్తే చాలు... న్యూ లుక్‌ సొంతమైనట్లే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్