అన్నంతోనూ సౌందర్యం..!

చర్మానికి మేలిమి ఛాయను అందించడంలో బియ్యం కడుగు బాగా పని చేస్తుందనేది తెలిసిన విషయమే. కానీ అన్నంతోనూ ఇది లభిస్తుందని తెలుసా. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను కలిపి ఫేస్‌ప్యాక్‌ వేసి బ్యూటీ పార్లర్‌లో పొందే గ్లాస్‌ స్కిన్‌ని పొందవచ్చు. అదెలానో తెలుసుకుందామా.

Updated : 23 Feb 2024 05:17 IST

చర్మానికి మేలిమి ఛాయను అందించడంలో బియ్యం కడుగు బాగా పని చేస్తుందనేది తెలిసిన విషయమే. కానీ అన్నంతోనూ ఇది లభిస్తుందని తెలుసా. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను కలిపి ఫేస్‌ప్యాక్‌ వేసి బ్యూటీ పార్లర్‌లో పొందే గ్లాస్‌ స్కిన్‌ని పొందవచ్చు. అదెలానో తెలుసుకుందామా..

పచ్చిపాలతో.. రెండు టేబుల్‌ స్పూన్ల అన్నాన్ని తీసుకోవాలి. దానికి తగినన్ని పచ్చిపాలు లేదా పెరుగు కలిపి పేస్టులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి పావుగంటాగి చల్లటి నీటితో శుభ్రం చేస్తే సరి. రైస్‌లో ఉండే అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ముఖచర్మాన్ని తేమగా చేస్తూ వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు.

తేనెతో.. రెండు చెంచాల చొప్పున అన్నం, పులియబెట్టిన బియ్యం కడుగు, అరచెంచా చొప్పున తేనె, ఆరెంజ్‌ తొక్కలపొడి తీసుకుని మిశ్రమం చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత కడిగితే సరి. పులిసిన బియ్యం నీళ్లు జిడ్డుని తగ్గించి మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలను దూరం చేస్తాయి. వారానికి కనీసం రెండుసార్లు చేస్తే నిగారింపు మీ సొంతం అవుతుంది.

కీరాతో.. రెండు చెంచాలు మెత్తగా చేసిన అన్నానికి, అదే పరిమాణంలో కీరదోస గుజ్జు కలపాలి. దీన్ని ముఖం, మెడ భాగాలకు పట్టించి పావుగంటాగి కడగాలి. కీరా చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. విటమిన్‌- సి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అలర్జీలను తగ్గిస్తాయి. అలసిన కళ్లకు ఉపశమనం కలిగించడమే కాకుండా కంటి చుట్టూ నల్లటి వలయాలను తగ్గిస్తుంది. అదనపు నూనెలను నివారించి చర్మాన్ని హైడ్రేట్‌ చేసి కాంతిమంతంగా కనిపిస్తుంది.

క్యారెట్‌, అన్నం.. చెంచా చొప్పున క్యారెట్‌ ముక్కలు, అన్నం తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరాక చల్లటి నీటితో శుభ్రం చేయాలి. క్యారెట్‌లో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్‌ సి ఫెనొలిక్‌ ఆమ్లాలు చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి. ఎండవల్ల ఏర్పడే డార్క్‌స్పాట్స్‌ను తగ్గిస్తుంది. ఫ్రీరాడికల్‌తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్