పాదరక్షలకూ... అదనపు అందం!

దుస్తులకు తగ్గ చెప్పులుంటేనే అందం. అందుకే ఎంతో ముచ్చటపడి, వెతికిమరీ కొనుక్కుంటాం కూడా. తీరా కొన్ని కొద్దిరోజులకే వదులవుతాయి. మరికొన్ని రెండు, మూడుసార్లు ధరించే సరికే కాంతిని కోల్పోతాయి.

Published : 24 Feb 2024 02:19 IST

దుస్తులకు తగ్గ చెప్పులుంటేనే అందం. అందుకే ఎంతో ముచ్చటపడి, వెతికిమరీ కొనుక్కుంటాం కూడా. తీరా కొన్ని కొద్దిరోజులకే వదులవుతాయి. మరికొన్ని రెండు, మూడుసార్లు ధరించే సరికే కాంతిని కోల్పోతాయి. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేసే సౌకర్యాలొచ్చాయి. వీటినోసారి చూసేయండి.


స్ట్రాప్స్‌, గొలుసులూ...

శాండిల్స్‌, హీల్స్‌ స్ట్రాప్‌లు వాడే కొద్దీ వదులు అయిపోతాయి. చెప్పు జారుతున్నట్లు అనిపిస్తూ అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ స్ట్రాప్స్‌, చెయిన్స్‌ తెచ్చేసుకోండి. ప్లాస్టిక్‌, గోల్డ్‌, సిల్వర్‌ రకాల్లో, భిన్న రంగుల్లో దొరుకుతున్నాయి. షూ కలర్‌, స్టైల్‌ను బట్టి హీల్‌ కింద నుంచి పాదానికి చుట్టూ వచ్చేలా తగిలిస్తే చాలు. సౌకర్యంగా నడిచేయొచ్చు. పైగా పాదరక్షలకు అదనపు అందం కూడా!


క్లిప్పులు..

కొనేటప్పుడు రెండు మూడు రకాల డ్రెస్‌లకు నప్పుతాయని చెప్పులను ఎంచుకుంటామా! తీరా అవేమో కొన్ని రకాల దుస్తులపై సాదాగా కనిపిస్తుంటాయి. కంగారొద్దు... వాటినీ ఆకర్షణీయంగా మార్చేయొచ్చు. ఈ క్లిప్పులు చేసే పనదే. పూలు, పండ్లు, రాళ్లు, ముత్యాలు పొదిగి భలే అందంగా ఉన్నాయి కదూ! నచ్చినవి కొని పెట్టుకుంటే చాలు.

కావాల్సినప్పుడల్లా చెప్పులకు జత చేసుకోవడమే! పార్టీలు, వివాహాది శుభకార్యాలకు వెళ్లేటప్పుడు దుస్తులకు తగ్గట్లుగా పాదరక్షలకు వీటితో కొత్త మెరుపులను అద్దేయండి ఇక.


లేసులు, తీగలు...

సాదా హైహీల్స్‌కి నయా లుక్‌ తేవాలంటే లేసుల స్ట్రాప్‌లు తప్పనిసరి. కాంట్రాస్ట్‌లో అంటే... లేత వర్ణాల చెప్పులకు ముదురు వర్ణం లేసులు, ముదురు వర్ణాల వాటికి లేత వర్ణం లేసులు బాగా నప్పుతాయి. చెప్పులు వదులుగా ఉన్నాయన్న సమస్యా దూరమవుతుంది. అలాగే వర్ణభరితమైన సీతాకోకచిలుకను షూకి జత చేసినట్లుగా అనిపించే తీగలూ ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. సౌకర్యంతోపాటు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తున్న ఇవన్నీ మీ మనసూ... దోచేస్తున్నాయి కదూ. ఇంకెందుకాలస్యం. ఆన్‌లైన్‌లో వెతికేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్