ఎండకి... రంగు మారితే...

వేడి దంచేస్తోంది కదా! రోజూ కొద్దిసేపు అలా బయటికి వెళ్లొచ్చినా చాలు. చర్మం రంగు మారిపోతుంది. ట్యాన్‌ పట్టేసిందని తెగ తిట్టేసుకుంటాం. కానీ చర్మకణాలను యూవీ కిరణాల బారి నుంచి రక్షించే ప్రక్రియే ఇది. ఎంత మంచిదైనా చర్మం భిన్న రంగుల్లో కనిపిస్తోంటే ఏం బాగుంటుంది? ట్యాన్‌ని తేలిగ్గా పోగొట్టుకునే ఈ చిట్కాలను పాటిస్తే సరి.

Published : 26 Feb 2024 02:17 IST

వేడి దంచేస్తోంది కదా! రోజూ కొద్దిసేపు అలా బయటికి వెళ్లొచ్చినా చాలు. చర్మం రంగు మారిపోతుంది. ట్యాన్‌ పట్టేసిందని తెగ తిట్టేసుకుంటాం. కానీ చర్మకణాలను యూవీ కిరణాల బారి నుంచి రక్షించే ప్రక్రియే ఇది. ఎంత మంచిదైనా చర్మం భిన్న రంగుల్లో కనిపిస్తోంటే ఏం బాగుంటుంది? ట్యాన్‌ని తేలిగ్గా పోగొట్టుకునే ఈ చిట్కాలను పాటిస్తే సరి.

  • బంగాళదుంపను సన్నని చక్రాలుగా కోసి, సమస్య ఉన్నచోట రుద్దండి. దీనిలోని క్యాటకోలేజ్‌ అనే ఎంజైమ్‌ ట్యాన్‌ను తగ్గిస్తే... యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి.
  • పైనాపిల్‌ ముక్కను తీసుకొని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. దానికి చెంచా తేనె కలిపి, ట్యాన్‌ ఉన్న ప్రదేశంలో పూతలా వేయండి. ఇరవై నిమిషాలయ్యాక చల్లని నీటితో కడిగేస్తే చాలు. దీనిలోని ఎ, సి విటమిన్లు దెబ్బతిన్న చర్మకణాలను పునరుత్తేజం చేస్తాయి. బ్రొమెలైన్‌, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం తిరిగి నిగారించేలా చేస్తాయి.
  • స్ట్రాబెర్రీలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లు ఉంటాయి. వీటిని తాజా క్రీమ్‌తో కలిపి, మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాసి, 20 నిమిషాలయ్యాక చల్లని నీటితో కడిగేస్తే చాలు. రంగు మెరుగవడమే కాదు, చర్మానికి కావాల్సిన తేమా అందుతుంది.
  • కలబందలోని విటమిన్‌ ఇ కూడా ట్యాన్‌ను దూరం చేసేదే. దీని గుజ్జును చర్మానికి పట్టించండి. ఎండ వేడి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ట్యానే కాదు, ఎండ కారణంగా ఏర్పడే ఎర్రదనం, అలర్జీలకూ ఇది మెరుగైన ఔషధం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్