చోకర్‌-నెక్లెస్‌ జోడీ కట్టాయి!

పెళ్లో, పేరంటమో మెడ నిండుగా నగలు వేసుకుంటే ఆ అందమే వేరు.  అందుకోసమే పొడవాటి హారానికి జతగా మెడ వరకూ మాత్రమే ఉండే నెక్లెస్సో, చోకరో పెట్టుకుని మురిసిపోతుంటాం.

Updated : 27 Feb 2024 05:24 IST

పెళ్లో, పేరంటమో మెడ నిండుగా నగలు వేసుకుంటే ఆ అందమే వేరు.  అందుకోసమే పొడవాటి హారానికి జతగా మెడ వరకూ మాత్రమే ఉండే నెక్లెస్సో, చోకరో పెట్టుకుని మురిసిపోతుంటాం. అయితే, ఎప్పుడూ ఒకటే శైలిని అనుసరిస్తామంటే ఎలా అనుకున్నారో ఏమో గానీ డిజైనర్లు... దానికి భిన్నంగా ఇప్పుడు చోకర్‌కి నెక్లెస్‌ని జోడీగా సెట్‌ చేసి మగువల సోయగాన్ని రెట్టింపు చేస్తున్నారు. వీటిల్లో అచ్చంగా బంగారంతో చేసినవే కాదు, పోల్కీ కుందన్లూ, ముత్యాలూ, పచ్చలూ కలగలిపినవీ, టెంపుల్‌ డిజైన్లూ, నవరత్నాల సెట్లు... ఒకటేమిటి ఎన్నెన్నో రకాలను మ్యాచ్‌ చేసి మెరిసిపోయేలా చేస్తున్నారు. చోకర్‌-నెక్లెస్‌ కలిపిన ఈ సెట్లు పెట్టుకోవడం వల్ల ఆధునికంగానే కాదు... అందంగానూ కనిపిస్తుండటంతో ఈ తరం అమ్మాయిలూ వీటిని మెచ్చేస్తున్నారు. చీర, లెహెంగా, లాంగ్‌ఫ్రాక్‌ దేనిమీదకైనా చక్కగా అమరిపోతున్న వీటిని వేసుకుని సంబరపడిపోతున్నారు. వాటినోసారి మీరు చూస్తే... మనసుపారేసుకోకుండా ఉండలేరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్