ఏ వయసులో మొదలు పెడుతున్నారు...!

యుక్తవయసులో తరచూ హార్మోన్లలో మార్పులు, నూనె ఉత్పత్తులు పెరిగి మొటిమలు, మంట ఏర్పడతాయి. ఈ వయసే ప్రధానం కాబట్టి జాగ్రత్తలు తీసుకోకపోతే ముందస్తు వృద్ధాప్య ఛాయలు వచ్చే అవకాశం ఉంది.

Updated : 27 Feb 2024 04:59 IST

యుక్తవయసులో తరచూ హార్మోన్లలో మార్పులు, నూనె ఉత్పత్తులు పెరిగి మొటిమలు, మంట ఏర్పడతాయి. ఈ వయసే ప్రధానం కాబట్టి జాగ్రత్తలు తీసుకోకపోతే ముందస్తు వృద్ధాప్య ఛాయలు వచ్చే అవకాశం ఉంది. ఇందుకు గానూ..

  • ముందుగా మీ చర్మ తత్త్వాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా యుక్త వయసులో చర్మం పొడిగా, జిడ్డుగా అనిపిస్తుంటే మీ చర్మానికి సరిపడే వాటిని ఎంపిక చేసుకోవాలి.
  • ముఖాన్ని రోజుకు రెండుసార్లు శుభ్రపరచుకోవాలి. దీనికి సల్ఫేట్‌ లేని క్లెన్సర్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇవి మన చర్మం పొడిబారడాన్ని తగ్గించి ముఖంపై పేరుకున్న మురికి, నూనె, ఇతర కాలుష్య కారకాలను తొలగించడానికి సాయపడతాయి. చర్మాన్ని మృదువుగానూ ఉంచుతాయి.
  • మాయిశ్చరైజర్‌ను బెస్ట్‌ ఫ్రెండ్‌గా చేసుకోవాలి... జిడ్డు చర్మం ఉన్నప్పటికీ మాయిశ్చరైజర్‌ను రోజూ రాయడం అలవాటు చేసుకోవాలి. ఇది చర్మాన్ని బిగుతుగా కాకుండా హైడ్రేట్గా ఉంచుతుంది. అదనపు నూనెల ఉత్పత్తిని అడ్డుకుని చర్మాన్ని జిడ్డు లేకుండా సమతుల్యం చేస్తుంది.
  • రసాయనాలు, ఆల్కహాల్‌, పరిమళాలతో కూడిన సౌందర్య ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఇవి చర్మాన్ని పొడిగా చేసి చికాకు పెడుతుంటాయి. ఉత్పత్తులను ఎంచుకునే ముందు బీపీఏ, థాలేట్స్‌, పారాబెన్‌లు,  సువాసనలు లేని, గాఢత తక్కువ ఉండే సౌందర్య ఉత్పత్తులను ఎంచుకుంటే చర్మంపై వచ్చే మంట, ఎర్రబడటం తగ్గి ముఖానికి నిగారింపునిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్