అమ్మో ఎండాకాలం...

అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. వేడి, చెమటకు  చర్మంపై మొటిమలు, మచ్చలు...  ఇబ్బందిపెడతాయి. వీటికి¨ వాయుకాలుష్యం, ఒత్తిడి, ఆహారపుటలవాట్లు తోడై... ముడతలు, నల్లటి వలయాలు, నిస్తేజమైన చర్మం మిమ్మల్ని కలవరపెట్టొచ్చు.

Published : 29 Feb 2024 01:52 IST

అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. వేడి, చెమటకు చర్మంపై మొటిమలు, మచ్చలు... ఇబ్బందిపెడతాయి. వీటికి¨ వాయుకాలుష్యం, ఒత్తిడి, ఆహారపుటలవాట్లు తోడై... ముడతలు, నల్లటి వలయాలు, నిస్తేజమైన చర్మం మిమ్మల్ని కలవరపెట్టొచ్చు. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ఐస్‌క్యూబ్స్‌తో ఆ ప్రదేశంలో మర్దన చేస్తే సత్వర ఉపశమనం లభిస్తుంది. చర్మం కాంతిమంతంగానూ మెరుస్తుంది.

  • ఐస్‌ట్రేలో టొమాటో, కలబంద గుజ్జు, దోసకాయ రసం, గ్రీన్‌టీ, కాఫీ, రోజ్‌వాటర్‌ వంటి పదార్థాలను ఫ్రీజ్‌ చేసి ముఖానికి మృదువుగా వలయాకార పద్ధతిలో మర్దన చేయాలి.
  • ఒకవేళ మీ చర్మం సున్నితంగా ఉంటే నేరుగా కాకుండా ఈ ఐస్‌క్యూబ్స్‌ని మెత్తని క్లాత్‌ లేదా టిష్యూలో చుట్టి రుద్దాలి. ఇది కోల్డ్‌ కంప్రెస్డ్‌గా పనిచేస్తుంది.
  • జిడ్డు చర్మం ఉన్న కొంతమందిలో ముఖంపై ఉండే రంధ్రాలు పెద్దగా కనిపిస్తుంటాయి. వీటిలో దుమ్మూ, ధూళి చేరతాయి. వీటిని తొలగించడానికి ఐస్‌క్యూబ్స్‌ బాగా ఉపయోగపడతాయి. ఇవి రంధ్రాల్లో పేరుకున్న మురికీ, మలినాలను తొలగించి శుభ్రం చేస్తాయి. మంచు ముక్కలతో ఫేషియల్‌ చేస్తే క్రమంగా రంధ్రాల పరిమాణం తగ్గి చిన్నవిగా కనిపిస్తాయి.
  • ఐస్‌క్యూబ్స్‌తో మసాజ్‌ చేయడం వల్ల ఆ ప్రాంతంలో రక్తప్రసరణ జరిగి ముఖానికి ఆక్సిజన్‌ అంది ఆరోగ్యకరమైన మెరుపు సంతరించుకుంటుంది. ఒత్తిడి వల్ల ఏర్పడే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మం బిగుతుగా మారుతుంది.
  • మేకప్‌ వేసుకునే ముందు ఈ ఐస్‌క్యూబ్‌తో మర్దన చేసి తరవాత ప్రైమర్‌ను వేస్తే జిడ్డుతత్త్వం అదుపులో ఉంటుంది. అలంకరణ ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్