మెరుపునిచ్చే సహజ స్క్రబ్‌లివి...

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో... కాబోయే వధువులు షాపింగ్‌లూ, స్నేహితులతో పార్టీలూ అంటూ తరచూ బయటే తిరగాల్సి వస్తుంది. దీంతో తీరా వివాహ సమయానికి ముఖం కళావిహీనంగా మారుతుంది. ఇలాంటప్పుడు చర్మం పునరుత్తేజం పొందడానికి ఈ సహజ స్క్రబ్‌లు మేలు చేస్తాయి.

Updated : 01 Mar 2024 02:55 IST

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో... కాబోయే వధువులు షాపింగ్‌లూ, స్నేహితులతో పార్టీలూ అంటూ తరచూ బయటే తిరగాల్సి వస్తుంది. దీంతో తీరా వివాహ సమయానికి ముఖం కళావిహీనంగా మారుతుంది. ఇలాంటప్పుడు చర్మం పునరుత్తేజం పొందడానికి ఈ సహజ స్క్రబ్‌లు మేలు చేస్తాయి.

  • ఎండ ప్రభావానికి చర్మం నిర్జీవంగా మారిందా? కప్పు అరటిపండు గుజ్జుకి చెంచా చక్కెర కలిపి ముఖానికి రాసి రుద్దండి.  ఇలా పది నిమిషాలు చేసి  శుభ్రం చేస్తే చాలు. ఇందులో ఉండే విటమిన్‌ ఎ, బి, ఇ, పొటాషియం వంటి పోషకాలు చర్మంపై మృతకణాలను తొలగించి మృదువుగా మారుస్తుంది.
  • రెండు చెంచాల కాఫీ పొడిలో కాస్త తేనె కలిపి ఓ పదినిమిషాల పాటు ముఖాన్ని రుద్దండి. కాఫీ స్క్రబ్‌ ముఖంపై ఉన్న దుమ్మూ ధూళీ, మృతకణాలను సులువుగా తొలగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా చేసి, ప్రకాశవంతంగా మారుస్తుంది.
  • రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్స్‌లో కాసిని పాలు, తేనె, గులాబీనీళ్లు కలిపి ముఖానికి రాయాలి. మునివేళ్లతో కనీసం పది నిమిషాలైనా రుద్ది చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడంవల్ల  మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది.
  • కప్పు కలబందలో రెండు చెంచాల చక్కెర, నిమ్మను కలిపి ముఖానికి స్క్రబ్‌ చేయాలి. ఇది కంటికింద నల్లటి వలయాలను దూరం చేసి, చర్మాన్ని తేమగా ఉంచుతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్