వేసవి వేడుకలకు... నీలిపచ్చని అందాలు!

ఎండలేమో మండిపోతున్నాయి... వేడుకలేమో ఆహ్వానిస్తున్నాయి. కాస్త మనల్ని ఇబ్బందిపెట్టే వ్యవహారమే! అలాగని సరదాల్ని పక్కన పెట్టేస్తామా చెప్పండి? ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటాం కానీ.

Published : 02 Mar 2024 01:34 IST

ఎండలేమో మండిపోతున్నాయి... వేడుకలేమో ఆహ్వానిస్తున్నాయి. కాస్త మనల్ని ఇబ్బందిపెట్టే వ్యవహారమే! అలాగని సరదాల్ని పక్కన పెట్టేస్తామా చెప్పండి? ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటాం కానీ. అలాంటప్పుడు తేలికగా మేనిని చుట్టేస్తూ... చూపరులను కట్టేసే వాటికే కదా మన ఓటు! అందుకే ‘నెట్‌’ చీరల సందడి మొదలైంది. జింకల్లా చకచకా పరుగెత్తే అమ్మాయిలకు ఇవి తెగ నప్పేస్తున్నాయి. వీటిల్లోనూ అన్ని రంగులూ కాదండోయ్‌... ‘పచ్చ’కే ప్రాధాన్యమిస్తున్నారు. వాటిల్లోనూ కలబంద, సీ గ్రీన్‌, ఆలివ్‌, లెమన్‌ గ్రీన్‌, టర్కోయిజ్‌... అంటూ లేత, పేస్టల్‌ గ్రీన్‌ రకాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇవైతే తాజా లుక్‌ని ఇస్తాయన్న నమ్మకం మరి. ఇవన్నీ అలాంటి రకాలే! కట్‌దానా, రేషమ్‌, చికన్‌కారీ, ప్యాచ్‌ బోర్డర్‌ వర్క్‌, మగ్గం, జరీ, కార్డ్‌ వర్క్‌, సీక్విన్స్‌, కట్‌బీడ్స్‌, స్టోన్‌, ముత్యాలను జోడించుకొని భలే అందంగా ఉన్నాయి కదూ! కాటన్‌, సింథటిక్‌ బ్లెండెడ్‌ నెట్‌ చీరలను ఎంచుకుంటే సరి. తేలికగా ఉంటాయి. ఊపిరి పీల్చుకోవడానికీ హాయి... పెద్దగా నగల అవసరమూ ఉండదు. ఇంతకంటే ఈ కాలంలో ఈతరం అమ్మాయిలు కోరుకునేది ఏముంటుంది చెప్పండి? అందుకే నచ్చిన వర్క్‌, కాస్త పెద్ద జుంకీలు... అంతే! వేడుకలకు సిద్ధం అనేస్తున్నారు. మీరూ ఇలాంటి వాటి కోసమే చూస్తున్నారా? ఇంకేం... వసంతం విరిసినట్లున్న పేస్టల్‌ గ్రీన్‌ నెట్‌ చీరల కోసం వెతికేయండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్