చెమట వాసనా..!

ఎండాకాలంలో చెమటతో ఇబ్బందే. ఇవి కొందరిలో తీవ్ర దుర్వాసనను కలిగిస్తాయి. దీన్ని దూరం చేయడానికి రసాయనాలతో కూడిన బాడీస్ప్రేలూ, సెంట్‌లూ వాడుతుంటారు.  బదులుగా సహజ పదార్థాలతో సమస్యను దూరం చేసుకోవచ్చు.

Published : 25 Mar 2024 01:36 IST

ఎండాకాలంలో చెమటతో ఇబ్బందే. ఇవి కొందరిలో తీవ్ర దుర్వాసనను కలిగిస్తాయి. దీన్ని దూరం చేయడానికి రసాయనాలతో కూడిన బాడీస్ప్రేలూ, సెంట్‌లూ వాడుతుంటారు.  బదులుగా సహజ పదార్థాలతో సమస్యను దూరం చేసుకోవచ్చు. అదెలాగంటే...

  • రెండు చెంచాల టీట్రీ ఆయిల్‌కీ, అదే పరిమాణంలో నీటిని కలిపి... స్ప్రే బాటిల్లో వేయాలి. ఈ మిశ్రమాన్ని చెమట ఎక్కువ పట్టే భాగాల్లో చల్లితే సరి. టీట్రీ ఆయిల్‌ సహజ క్రిమినాశిని. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉండటం వల్ల దుర్వాసన దూరమవుతుంది. దీంతో పాటు గ్రీన్‌టీ ఆకులను వేడినీళ్లల్లో మరిగించి...చల్లారాక అందులో దూదిని ముంచి, ఆ శరీర భాగాల్లో తరచూ శుభ్రం చేయాలి. అప్పుడు నెమ్మదిగా వాసన దూరం అవుతుంది. గ్రీన్‌ టీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
  • చెమట వాసన రావడానికి శరీరంలోని పీహెచ్‌ స్థాయులు కూడా ఒక కారణం. ఇందుకు రెండు చెంచాల చొప్పున నిమ్మరసం, మొక్కజొన్న పిండిని తీసుకుని పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాహుమూలల్లో రాసి పదినిమిషాలు మర్దన చేయాలి. ఇలా రోజుకోసారి చేస్తే చెడువాసన దూరమవుతుంది.
  • టొమాటో, నిమ్మరసాల్నీ సమపాళ్లలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చెమట వాసన వచ్చే చోట రాసి పదినిమిషాలాగి చల్లటి నీటితో కడిగేయాలి. టొమాటో చెడు బ్యాక్టీరియాను నిరోధించడంలో సాయపడుతుంది.
  • కప్పు యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌కి అరకప్పు నీటిని కలిపి స్ప్రే బాటిల్లో నింపాలి. దీన్ని రోజూ రాత్రి నిద్రపోయే ముందు అండర్‌ఆర్మ్స్‌కు రాసి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగితే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్