గడువు దాటితే వద్దు...

అందంగా కనిపించడం కోసం మేకప్‌ వేసుకుంటాం. మళ్లీ రాత్రికి దాన్ని తొలగించి నిద్రపోతాం. ఇలా అలంకరణ ఒక్కటే ఉంటే సరిపోదు.

Published : 26 Mar 2024 01:54 IST

అందంగా కనిపించడం కోసం మేకప్‌ వేసుకుంటాం. మళ్లీ రాత్రికి దాన్ని తొలగించి నిద్రపోతాం. ఇలా అలంకరణ ఒక్కటే ఉంటే సరిపోదు. దానికోసం ఉపయోగించే సాధనాల గడువు తేదీలూ గమనిస్తుండాలి...

  • అందమైన కలువలాంటి కళ్ల కోసం వాడే ఐలైనర్‌, మస్కారా, కాజల్‌ వంటివి గడువులోగా వాడేయాలి. ఎందుకంటే వీటి గడువు మూడు నెలలు మాత్రమే. గడువు దాటితే ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • మేకప్‌ కోసం వాడే బ్లష్‌, ఐ షాడో వంటివి ఏడాదికి మించి వాడకూడదు.
  • పెదాలు అందంగా కనిపించడం కోసం రంగురంగుల లిప్‌స్టిక్‌, లిప్‌గ్లాస్‌లు వాడుతుంటాం కదా! వీటి గడువు కూడా ఒకటిన్నర సంవత్సరాలే. వీటిని చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. లేకపోతే వేడికి బ్యాక్టీరియా వాటిపై చేరే అవకాశం ఉంది. దీంతో చర్మంపై దురద, మొటిమలు వస్తుంటాయి.
  • ఫౌండేషన్‌, క్లెన్సర్‌, మాయిశ్చరైజర్‌లు క్రీమ్‌ ఆధారితమైనవి. కాబట్టి వాటిని కనీసం 12 నుంచి 18 నెలల వరకూ ఉపయోగించుకోవచ్చు. వీటి గడువు ముగిస్తే పారేయాలే అన్న బెంగ వద్దు. పాదాలు, చేతులకు రాసుకుంటే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్