ఫ్రిల్స్‌లో... బుట్టబొమ్మ!

అమ్మాయి పుడితే ఏ అమ్మయినా కుచ్చుకుచ్చులుగా ఓ గౌను కుట్టించేస్తుంది. ఆ చిన్నారి దాన్ని వేసుకుని నడిచొస్తోంటే ‘బుట్టబొమ్మే’ అంటూ మురిసిపోతుంది. ఆ ఫ్రిల్స్‌ ఫ్యాషన్‌ పిల్లలకే పరిమితం అవ్వడం లేదిప్పుడు. ప్రీవెడ్డింగ్‌, హల్దీ, మెహెందీ... అంతెందుకు, మెటర్నిటీ షూట్‌లైనా ఇప్పుడు యువతుల ఎంపిక ‘ఫ్రిల్సే’ అవుతున్నాయి.

Published : 29 Mar 2024 02:14 IST

అమ్మాయి పుడితే ఏ అమ్మయినా కుచ్చుకుచ్చులుగా ఓ గౌను కుట్టించేస్తుంది. ఆ చిన్నారి దాన్ని వేసుకుని నడిచొస్తోంటే ‘బుట్టబొమ్మే’ అంటూ మురిసిపోతుంది. ఆ ఫ్రిల్స్‌ ఫ్యాషన్‌ పిల్లలకే పరిమితం అవ్వడం లేదిప్పుడు. ప్రీవెడ్డింగ్‌, హల్దీ, మెహెందీ... అంతెందుకు, మెటర్నిటీ షూట్‌లైనా ఇప్పుడు యువతుల ఎంపిక ‘ఫ్రిల్సే’ అవుతున్నాయి. ‘హా... వేడుకలకే! అదీ లెహెంగాలకే... మిగతా వాటికి పనికి రాదు’ అని బెంగ పడాల్సిన పనీలేదు. స్నేహితులతో మీటింగ్‌, ఆఫీసు ఔటింగ్‌, చిన్న టూర్‌... వీటికీ తగ్గట్టుగా క్రాప్‌టాప్‌లు, మిడిల్‌ లెంత్‌, ఫ్లోర్‌ లెంత్‌ ఫ్రాక్‌లొస్తున్నాయి. జార్జెట్‌, కాటన్‌, నెట్‌... వంటి పలు వస్త్రరకాల్లో దొరుకుతున్నాయి. అంటే... సందర్భానికి తగ్గట్టుగా ఉన్నాయి. మీకు ఏది అనువైనదో ఎంచుకోవడమే తరువాయి. మరి... మీరూ అవుతారా... బుట్టబొమ్మ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్