అమ్మో.. లిప్‌స్టిక్‌!

అధరాలు అందంగా కనపడేందుకు ప్రతి అమ్మాయి ఎంపిక లిప్‌స్టిక్‌. మరి అదంతా ఆవిరైపోతుందనుకుంటున్నారా... అస్సలే కాదంటున్నాయి అధ్యయనాలు.. మరేమైపోతుంది ఆ లిప్‌స్టిక్‌ అంతా అంటే.. ఒక మహిళ తన జీవితకాలంలో దాదాపు 1.8కేజీల లిప్‌స్టిక్‌ని తనకి తెలియకుండానే తినేస్తుందట.

Published : 29 Mar 2024 02:18 IST

అధరాలు అందంగా కనపడేందుకు ప్రతి అమ్మాయి ఎంపిక లిప్‌స్టిక్‌. మరి అదంతా ఆవిరైపోతుందనుకుంటున్నారా... అస్సలే కాదంటున్నాయి అధ్యయనాలు.. మరేమైపోతుంది ఆ లిప్‌స్టిక్‌ అంతా అంటే.. ఒక మహిళ తన జీవితకాలంలో దాదాపు 1.8కేజీల లిప్‌స్టిక్‌ని తనకి తెలియకుండానే తినేస్తుందట. లిప్‌స్టిక్‌ మోతాదుల్లో తేడా ఉంటే ఉండొచ్చు కానీ దాని ప్రభావం అందరి మీదా పడుతోంది. ఎందుకంటే లిప్‌స్టిక్‌లో కొన్ని హానికర లోహాలు, పారాబెన్‌లు, రసాయనాలు అధికంగా ఉంటాయి. అవి రక్తంలో కలిసిపోయి హాని కలిగిస్తాయి.. వాళ్ల నుంచి పిల్లలకూ అవి సంక్రమిస్తాయి. ఈ విషయమై కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన నిపుణులు, 30 మంది యువతులపై అధ్యయనం చేయగా, వాళ్ల రక్తంలో అత్యధిక పాళ్లలో లోహాలు ఉన్నట్టు తేలిందట. లిప్‌స్టిక్‌ని సగటున రోజుకి రెండు సార్లు వాడటం వల్ల 24 మిల్లీగ్రాముల లోహాలు రక్తంలో కలుస్తున్నాయట. కాబట్టి.. అమ్మాయిలు వేసుకునే ముందు ఆలోచించండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్