హాట్‌ చాక్లెట్‌... చెప్పులు చూశారా!

ఫ్యాషన్‌ అంటే దుస్తులూ, నగలే కాదు...చెప్పులు కూడా. అందుకే, ఇవీ తమకో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాలనుకుంటోంది యువతరం. అయితే, ఆడంబరంగానే కాదు...కాస్త ఆధునికంగానూ, వైవిధ్యంగానూ ఉండాలని కోరుకుంటుంది.

Published : 30 Mar 2024 01:23 IST

ఫ్యాషన్‌ అంటే దుస్తులూ, నగలే కాదు...చెప్పులు కూడా. అందుకే, ఇవీ తమకో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాలనుకుంటోంది యువతరం. అయితే, ఆడంబరంగానే కాదు...కాస్త ఆధునికంగానూ, వైవిధ్యంగానూ ఉండాలని కోరుకుంటుంది. అందుకే, వారిని మెప్పించేందుకు క్విర్కీ, ఫంకీ స్టైల్స్‌లో ఫుట్‌వేర్‌ డిజైన్లెన్నో మార్కెట్‌ని ముంచెత్తుతున్నాయి. వాటిల్లో హాట్‌ చాక్లెట్‌ డిజైన్‌ ట్రెండ్‌ ఒకటి. ముఖ్యంగా ఇందులో చాకొలెటికాస్‌ రకం యువతను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీన్ని మొదట 2004లో వెనెజులాలోని యువత కోసం తయారు చేశారట. అప్పటికే చిన్నపిల్లలకోసం ఎక్కువగా మేరీ జేన్‌ డిజైన్‌లో రూపొందించే షూలను పోలి ఉంటాయివి. వాటికి భిన్నంగా కాస్త కొత్త లుక్‌లో రెట్రో స్టైల్‌ని గుర్తు తెచ్చే చిత్రాలు, రంగులతో వీటిని రూపొందించారు. ఇవి ఒకదాని డిజైన్‌కి మరొకటి భిన్నంగా ఉండటమే వీటి ప్రత్యేకత. అంతేకాదు, పండ్లూ, పూలు, వస్తువులు, పోట్రెయిట్‌ థీమ్స్‌ ఇలా...ఎన్నో బొమ్మలూ ఈ చెప్పులపై కొలువుదీరుతున్నాయి. మీరూ వాటినోసారి చూసేయండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్