జుట్టుకీ బుట్ట అందం!

తరాలు మారుతున్నా చెవులకు బుట్టలు తెచ్చే అందం మాత్రం మారదేమో! అందుకే అప్పటికీ, ఇప్పటికీ బుట్టలు ట్రెండే... ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లతో అమ్మాయిల మనసు దోచేస్తూ ఉంటాయి.

Published : 02 Apr 2024 01:44 IST

రాలు మారుతున్నా చెవులకు బుట్టలు తెచ్చే అందం మాత్రం మారదేమో! అందుకే అప్పటికీ, ఇప్పటికీ బుట్టలు ట్రెండే... ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లతో అమ్మాయిల మనసు దోచేస్తూ ఉంటాయి. అయితే ఆ బుట్టల సొగసు జడబిళ్లల్లోనూ కనిపించాలని కోరుకుంటోంది ఈతరం.

ఏ పెళ్లికో, పేరంటానికో వెళ్లాలనుకున్నప్పుడు అంతా బాగా తయారవుతాం. మరి హెయిర్‌ స్టైల్‌కీ ప్రాధాన్యమివ్వాలి కదా! రోజూలానే అలా మామూలు క్లిప్పు పెట్టుకొని వెళ్తే లుక్కేముంటుంది? అనుకుంటున్నారు కాబోలు... అందుకోసం ప్రత్యేకంగా ఈ జడబిళ్లలను ఏరికోరి ఎంపిక చేసుకుంటున్నారు. జడబిళ్లకే బుట్ట ఎటాచ్‌ అయి ఉంటుంది. వీరి అభిరుచికి తగ్గట్టుగా తయారీదారులూ పచ్చలూ, కెంపులూ, ముత్యాలు, నెమళ్లూ, దేవతామూర్తుల రూపాలనూ పొందిగ్గా అమరుస్తున్నారు.

లూజ్‌ హెయిర్‌, బన్‌, జడ... ఇలా ఏ హెయిర్‌ స్టైల్‌కైనా చక్కగా నప్పుతుండడంతో అమ్మాయిలు వీటిపై మనసు పారేసుకుంటున్నారు. పైగా వీటికోసం పట్టుచీరలో, లంగాఓణీలో వేసుకోనక్కర్లేదు. సింపుల్‌గా ఓ ఫ్లోరల్‌ అనార్కలీ సూట్‌ వేసుకుని, హెయిర్‌ బన్‌లో ఈ బిళ్ల ఒకటి పెట్టేసుకుంటే చాలు. భలే లుక్కు వస్తుంది. మీరూ ప్రయత్నిస్తారా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్