బాదం పొట్టుతో అందంగా...

బాదం పప్పులు తిని వాటి పొట్టును పక్కన పడేస్తాం. బాదం శరీరానికి మేలు చేస్తోందనేది మనకు తెలుసు. అలానే బాదం పొట్టుతో కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. బాదం పొట్టులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌-ఇ పుష్కలంగా ఉంటాయి.

Published : 03 Apr 2024 01:48 IST

బాదం పప్పులు తిని వాటి పొట్టును పక్కన పడేస్తాం. బాదం శరీరానికి మేలు చేస్తోందనేది మనకు తెలుసు. అలానే బాదం పొట్టుతో కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.

బాదం పొట్టులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌-ఇ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎండబెట్టి పొడి చేసి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. పదినిమిషాలు ఉంచి ఆపై శుభ్రం చేసుకుంటే సరి. ఇది చర్మానికి తేమ అందించి కంటి కింద ఉన్న నల్లటి వలయాలను తగ్గిస్తుంది.

బాదం పొట్టులో విటమిన్‌-ఇ ఉంటుంది. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. బాదం తొక్కలను పేస్ట్‌గా చేసి దానికి తేనె, కలబంద గుజ్జు, గుడ్డు తెల్లసొన కలిపి జుట్టుకు పట్టించాలి. ఒక అరగంట పాటు ఉంచి కడగాలి. జుట్టు మృదువుగా, దృఢంగా మారుతుంది. అంతేకాదు, తలలో పేలు, దురద వంటి సమస్యల నుంచీ వెంటనే ఉపశమనం దొరుకుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్