మత్స్యకన్యలా మెరిసిపోదాం...

ఒకప్పుడు పెళ్లి, ఫంక్షన్‌ అనగానే ముందు గుర్తొచ్చేవి పట్టు వస్త్రాలే. కానీ ఇప్పుడు లెహెంగాలే ట్రెండవుతున్నాయి. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌, సంగీత్‌, మెహెందీ, రిసెప్షన్‌ వంటి వేడుకలకి అమ్మాయిల మొదటి ఎంపిక ఇవే. వేడుకలకు హాజరయ్యే యువతుల ఓటూ వీటికే! ఏ ఫ్యాషన్‌ అయినా సరే కాలానికి తగ్గట్లు మారితేనే కదా... అది మార్కెట్లో నిలబడుతుంది.

Published : 05 Apr 2024 01:54 IST

ఒకప్పుడు పెళ్లి, ఫంక్షన్‌ అనగానే ముందు గుర్తొచ్చేవి పట్టు వస్త్రాలే. కానీ ఇప్పుడు లెహెంగాలే ట్రెండవుతున్నాయి. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌, సంగీత్‌, మెహెందీ, రిసెప్షన్‌ వంటి వేడుకలకి అమ్మాయిల మొదటి ఎంపిక ఇవే. వేడుకలకు హాజరయ్యే యువతుల ఓటూ వీటికే! ఏ ఫ్యాషన్‌ అయినా సరే కాలానికి తగ్గట్లు మారితేనే కదా... అది మార్కెట్లో నిలబడుతుంది. అది తెలిసిన డిజైనర్లు కూడా ఎప్పటికప్పుడు ఎన్నెన్నో ట్రెండ్స్‌ తీసుకొస్తున్నారు. అలా ఇప్పుడు ఎక్కువమంది మనసు పారేసుకుంటున్న జాబితాలోకి ‘ఫిష్‌ కట్‌ లెహెంగా’లు చేరాయి. నడుము నుంచి మోకాళ్ల వరకూ శరీరానికి అతుక్కున్నట్లుగా ఉండి, అక్కడి నుంచి కుచ్చులు చేప తోకలా వెడల్పుగా విస్తరిస్తూ వస్తాయి. ఒకరకంగా ధరించిన వారికి మత్స్యకన్య రూపాన్నిస్తాయి. అందుకే వీటికి ‘జల్‌పరి’, ‘మర్‌మైడ్‌’ లెహెంగాలనీ పేరు. కాటన్‌, బనారసీ, నెట్‌, జార్జెట్‌ రకాల్లోనూ దొరుకుతున్నాయి. ఫ్లోరల్‌ ఫిలిగ్రీ, ఎంబ్రాయిడరీ, స్టోన్‌, త్రెడ్‌ వర్క్‌, చికన్‌కారీ, సీక్విన్‌, పెరల్‌, క్రిస్టల్‌ ఎంబ్రాయిడరీలను జోడించుకొని అమ్మాయిల మనసు దోచేస్తున్నాయి. వేడుకను బట్టి... బోట్‌నెక్‌, ఫ్రిల్స్‌, వీ, కౌల్‌ నెక్‌లైన్‌... ఇలా నచ్చిన క్రాప్‌టాప్‌ను జత చేసేసుకుంటున్నారు. మన సంప్రదాయానికి విలువిస్తూనే విదేశీ హంగులు జోడిస్తున్న వాటికైతే జాన్వీ కపూర్‌, కియారా అడ్వాణి, అదితిరావ్‌ హైదరీ, సమంత, కాజల్‌, శ్రియా శరణ్‌ వంటి సెలబ్రెటీలూ ఫిదా అవుతున్నారు. వాటిని ధరించి నెట్టింట పోస్ట్‌లు కూడా పెడుతున్నారు. మరెందుకాలస్యం ఈ ట్రెండ్‌ను మీరూ ప్రయత్నించేయండి. అందమైన జలకన్యలా మెరిసిపోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్