అందం చెదరనీయవు!

వేడుకలైనా మామూలు రోజులైనా కురులతో వచ్చే తిప్పలే వేరు. ఓ పట్టాన లొంగవు. కష్టపడి స్టైల్‌ చేసుకున్నా ఏవో చిన్న లోపాలు. వీటిని ప్రయత్నించండి... పర్‌ఫెక్ట్‌ లుక్‌ని ఇచ్చేస్తాయి.

Published : 06 Apr 2024 01:57 IST

వేడుకలైనా మామూలు రోజులైనా కురులతో వచ్చే తిప్పలే వేరు. ఓ పట్టాన లొంగవు. కష్టపడి స్టైల్‌ చేసుకున్నా ఏవో చిన్న లోపాలు. వీటిని ప్రయత్నించండి... పర్‌ఫెక్ట్‌ లుక్‌ని ఇచ్చేస్తాయి.


అంతకు మించి..

జుట్టును విరబోయాలంటే అందమైన క్లిప్‌ లేదా హెడ్‌బ్యాండ్‌ సాయం కావాల్సిందే. కానీ అన్ని సందర్భాలకీ అలా సాదా లుక్‌ ఏం బాగుంటుంది చెప్పండి? వాటితోనూ ప్రత్యేకంగా కనిపించొచ్చు. అయితే ఈ డబుల్‌ లేయర్‌ ట్విస్ట్‌ ప్లెయిట్‌ క్లిప్‌, హెడ్‌బ్యాండ్లను తెచ్చుకోవాలి. వీటికి ముత్యాలు, పూల మాటున దాగి చిన్న క్లిప్‌ల్లాంటి అమరిక ఉంటుంది. పాయలను తీసి వాటిలో పెడితే చాలు. అందమైన హెయిర్‌ స్టైల్‌ నిమిషాల్లో పూర్తయి
పోతుంది.


తప్పించుకోనివ్వదు..

బేబీ హెయిర్‌... కురులు తిరిగి పెరుగుతున్నాయనడానికి చిహ్నమే అయినా ఇవి పెట్టే ఇబ్బంది మామూలుగా ఉండదు. జుట్టు విరబోసినా, ముడి వేసినా... అంతెందుకు జడ వేసినా బయటకు వచ్చేస్తాయి. సరిచేద్దామన్నా ఓ పట్టాన లొంగవు. ఈ ఇన్విజిబుల్‌ హెయిర్‌ హోల్డర్‌ తెచ్చేసుకోండి. వైరులా ఉండే ఇది బయటకు కనిపించకుండా చిన్ని వెంట్రుకలను బంధించేస్తుంది. అంతేనా... సరికొత్త హెయిర్‌స్టైల్‌ లుక్‌నీ తెచ్చిపెడుతుంది.


పఫ్‌కి సాయం..

ఫ్రంట్‌ పఫ్‌, క్రౌన్‌ పఫ్‌, బబుల్‌ పఫ్‌, లో పఫ్‌... ఇలా చెప్పుకొంటూ పోతే ఇంకెన్ని రకాలో! ప్రతి హెయిర్‌ స్టైల్‌లోనూ ఇప్పుడు పఫ్‌ పెట్టడం దాదాపుగా కనిపిస్తోంది. అది అందంగా కనిపించడానికి ప్రత్యేక క్లిప్‌లున్నాయని తెలుసుగా? కానీ దాన్ని కవర్‌ చేసే వెంట్రుకలు పక్కకు వెళితేనే సమస్య. అందుకే ఈ ఇన్విజిబుల్‌ ఫాల్స్‌ హెయిర్‌ క్లిప్‌ కావాలి. కురులను తలపించేలా బేస్‌ ఉంటుంది దీనికి. క్లిప్‌లా ఉన్న భాగాన్ని కురులకు అమర్చి ముందు వెంట్రుకలను దానిపైకి వచ్చేలా సెట్‌ చేసుకుంటే చాలు. ఉబ్బెత్తుగా కనిపించే పఫ్‌ సిద్ధమైనట్లే. ఏవైనా యాక్సెసరీలను అమర్చుకుంటే హెయిర్‌ స్టైల్‌ సిద్ధం. బాగున్నాయి కదూ! ఆన్‌లైన్‌ వేదికల్లో దొరుకుతున్నాయి. కావాలనిపిస్తే వెతికేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్