మది దోచే... బొట్టు మాల!

అమ్మాయిలంటేనే అలంకరణలూ, ఆభరణాలు. సందర్భం ఉండాలే కానీ, అందంగా తయారై మెరిసిపోరూ! పండగలు, వేడుకల వేళ సంప్రదాయం, సొగసూ ఇనుమడించేలా కనిపించేందుకు బొట్టునగల్ని మించిన ఎంపిక ఉండదు మరి.

Published : 10 Apr 2024 02:21 IST

అమ్మాయిలంటేనే అలంకరణలూ, ఆభరణాలు. సందర్భం ఉండాలే కానీ, అందంగా తయారై మెరిసిపోరూ! పండగలు, వేడుకల వేళ సంప్రదాయం, సొగసూ ఇనుమడించేలా కనిపించేందుకు బొట్టునగల్ని మించిన ఎంపిక ఉండదు మరి.

కాలాన్ని బట్టి దుస్తులూ, యాక్సెసరీల్లోనే కాదు...నగల్లోనూ డిజైన్లలోనూ ఎన్నో మార్పులు వచ్చేస్తుంటాయి. అయితే, కొన్నిసార్లు నయా రకాలు వస్తే మరికొన్ని పాత ఫ్యాషన్లే కొత్తందాలు చుట్టుకుని వస్తుంటాయి. అలా ఒకప్పుడు అమ్మ, అమ్మమ్మల తరం.... మెడలో పెట్టుకుని మురిసిపోయిన బొట్టు నగలు ఇప్పుడు ఆధునికతరం అందాన్ని రెట్టింపు చేసేందుకు కొత్త సొబగులద్దుకుని మళ్లీ వచ్చేశాయి. ధరించినవారి అందాన్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి.

నుదుటన పెట్టుకునే బొట్టు ఆకృతిలో చేసిన పెండెంట్ల వల్లే వీటికా పేరొచ్చింది. ఇవి చోకర్‌లు, హారాలు, నెక్లెస్‌లూ, కంటె... వంటి అన్ని రకాల నగలపైనా అందంగా అమరిపోయి ఆకట్టుకుంటున్నాయి. అందుకే సింపుల్‌గా కనిపించాలని కోరుకునేవారినే కాదు, ఆడంబరంగా ధగధగలాడిపోవాలనుకునే మగువలనీ మెప్పిస్తాయివి. కెంపులూ, పచ్చలూ, వజ్రాలు వంటి హంగుల్నీ అద్దుకుంటు న్నాయి. వీటిల్లో పోల్కీ కుందన్‌ బొట్టు మాలది పాపులర్‌ కాంబినేషన్‌.

ఈ నగల్లో ఏ రకం  ఎంచుకున్నా పండగవేళ పట్టు చీర ధరించినా, లంగా ఓణీ కట్టినా మెడలో ఈ బొట్టుమాల ఒక్కటి వేసుకుంటే చాలు నిండుదనం వచ్చేసినట్లే. మీకూ నచ్చేసిందా...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్