అవి టీనేజర్లకు కాదు!

ఫోన్లు, సోషల్‌ మీడియా అకౌంట్లు టీనేజర్లకూ సర్వసాధారణమైంది. సోషల్‌ మీడియా అంటేనే బోలెడు సమాచారం. వాటిల్లోనూ బ్యూటీ ఉత్పత్తులకు సంబంధించిన వాటికి టీనేజీ అమ్మాయిలు తెగ ఆకర్షితులవుతున్నారట.

Published : 11 Apr 2024 01:48 IST

ఫోన్లు, సోషల్‌ మీడియా అకౌంట్లు టీనేజర్లకూ సర్వసాధారణమైంది. సోషల్‌ మీడియా అంటేనే బోలెడు సమాచారం. వాటిల్లోనూ బ్యూటీ ఉత్పత్తులకు సంబంధించిన వాటికి టీనేజీ అమ్మాయిలు తెగ ఆకర్షితులవుతున్నారట. అంతేనా వాటిని ప్రయత్నిస్తున్నారు కూడా. కానీ అది ప్రమాదం అంటున్నారు నిపుణులు...

అటు పెద్దా కాదు... ఇటు చిన్నా కాదు అన్నట్లు ఉంటుంది టీనేజర్ల పరిస్థితి. అందం, శరీరంలో వచ్చే మార్పులపై తెలియకుండానే వాళ్ల దృష్టిపడుతుంది. దీంతో తమకేం నప్పుతాయా అని బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్లను అనుసరించడం మొదలుపెడుతున్నారట. అంతేనా... వాళ్ల సిఫారసులను పాటిస్తున్నారు కూడా. సమస్యల్లా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ల వయసు 20, ఆపైన. మెరిసే చర్మం, త్వరగా వృద్ధాప్యఛాయలు రావొద్దంటే విటమిన్‌ సి, రెటినాల్‌ సీరమ్‌లను వాడమనే వీళ్లలో ఎక్కువమంది సలహా. హార్మోనుల్లో మార్పులతో సహజంగా టీనేజర్ల మేని ఛాయలో మార్పు వస్తుంది. యాక్నే, మొటిమలు సరేసరి. తమకూ ఇవే సరిపడతాయని వాడేస్తున్నారు. చర్మాన్ని మెరిపించడంలోనూ, ఎండ నుంచి కాపాడటంలో విటమిన్‌ సి సాయపడుతుంది. రెటినాల్‌ బిగుతైన, మృదువైన చర్మాన్ని ఇస్తుంది. నిజమే కానీ ఇవి గాఢత ఎక్కువగా ఉంటాయి. వాళ్లవేమో లేత చర్మాలు. దీంతో ప్రయోజనానికి బదులు ముప్పే ఎక్కువగా కలుగుతోంది. అంతేకాదు... వీటిల్లోని రసాయనాలు వాళ్ల హార్మోన్లు, నెలసరిపైనా దుష్ప్రభావాలు చూపుతాయి. అందుకే గుడ్డిగా సోషల్‌ మీడియా సలహాలు అనుసరించొద్దు. మరి సమస్య తగ్గేదెలా అంటారా? వైద్యనిపుణులను కలవడం మేలు. వాళ్లూ ఇవే ఉన్నవి ఇచ్చినా మీ వయసు, చర్మతీరును గమనించి దాని ఆధారంగా తక్కువ గాఢతవి సూచిస్తారు. లేదంటారా... అనుకూలమైనవేవో చెబుతారు. అది మేలు కదా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్